‘ఆర్ఆర్ఆర్’ టీంని అభినందిస్తూ మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?

‘తెలుగుపాట గెలిచింది .. తెలుగుజాతి గర్వంగా తల ఎత్తింది .. ప్రపంచం వినయంగా తలవంచింది’.. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి దాదాపు పది నెలలవుతోంది. అయినా ఇప్పటికీ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో, వివిధ కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీంకి (నటీనటులు, సాంకేతిక నిపుణులు) అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడీ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డోన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. స్వరవాణి ఎమ్.ఎమ్.కీరవాణి ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. రాజమౌళి, కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కార్తికేయ దంపతులు ఈ ఆనందాన్నిసెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకి, కీరవాణికి సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ పాడారు.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు..

ఇది తెలుగు జాతికి గర్వకారణమని, తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవమని పలు భాషలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ టీంకి అలాగే కీరవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రిపులార్ చిత్రబృందానికి తన అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతీ భారతీయుడు గర్వించేలా చేశారు’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌పై మోడీ ప్రశంసలు కురిపించారు.

‘నాటు నాటు’ పాటను కంపోజ్ చేసిన కీరవాణితోపాటు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, నటీనటులు తారక్, చరణ్ ఇలా పేరుపేరునా అందరికీ ఆయన అభినందనలు తెలుపుతూ వీడియో షేర్ చేశారు. తెలుగు సినిమా అభిమానులు సామాజిక మాధ్యమాలలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి సంబంధించిన పిక్స్, వీడియోలు బాగా ట్రెండ్ చేస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus