Mohan Babu: ఇకపై నా పేరు వాడితే ఊరుకునేది లేదు: మోహన్ బాబు సీరియస్!

మంచు మోహన్‌ బాబు… సినిమాల్లో మేరునగం. అలాగే రాజకీయాల్లో కూడా ప్రభావం చూపించగల వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో ఆయన ఎంపీగా చేశారు కూడా. అయితే ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దిశగా ఏమీ చేయడం లేదు. అయితే మనోజ్‌ వదిన భూమా అఖిలప్రియ టీడీపీ తరఫున పోటీలో ఉండటంతో… ఆయన ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి. అయితే మోహన్‌బాబు ప్రమేయం లేకుండా కొందరు వ్యక్తులు రాజకీయంగా అతని పేరును ఉపయోగించుకుంటున్నారని వార్తలొచ్చాయి.

ఈ విషయంలో మోహన్‌బాబు (Mohan Babu) ఇటీవల స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో ఆయన ఓ వెబ్‌నోట్‌ను రిలీజ్‌ చేశారు. తన విషయంలో అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో ఆ నోట్‌, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన పేరును వాడుకుంటున్నది ఎవరు, ఏం చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. ఆ నోట్‌ మరికొన్ని విషయాలు కూడా రాశాయన.

ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే దృష్టి పెట్టాలి. అంతేగానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి లాగడం సరికాదు. ఇది బాధాకరం అని రాసుకొచ్చారాయన.

ఇప్పటివరకు తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేసిన ఆయన… శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని పిలుపునిచ్చారు. ఇక ఆయన మంచు విష్ణుతో కలిసి ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాను రూ.100కోట్ల భారీ బడ్జెట్‌ తెరకెక్కిస్తున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus