ఏ సెలబ్రిటీ గురించి వివరాలు సేకరించాలి అన్నా.. మనం వెంటనే ఆశ్రయించేది వికీపీడియానే అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాల వాళ్ళ గురించి అయినా రాజకీయ, పారిశ్రామికవేత్తల వివరాల గురించి అయినా.. వికీపీడియానే బెస్ట్ సోర్స్ అని అంతా చెబుతుంటారు. ఈ క్రమంలో వికీపీడియాలో జనాలు ఎక్కువగా వెతికిన సౌత్ సెలబ్రిటీల ప్రొఫైల్స్ ఎవరివి అనే ఓ సర్వే నిర్వహించగా.. వాటిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో … ఇళయదళపతి విజయ్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు.
మిలియన్ల కొద్దీ ప్రేక్షకులు వీళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా ఈ ఇద్దరు స్టార్లు రజినీకాంత్ నే సైడ్ ఎసెయ్యడం ఊహించని విషయం. మొదటి స్థానంలో నిలిచిన ప్రభాస్ గురించి 15.94 మిలియన్ పీపుల్ సెర్చ్ చేయడం విశేషం. ‘బాహుబలి'(సిరీస్)ద్వారా ఇతని క్రేజ్ బౌండరీలు దాటిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం డామినేట్ చేసే క్రేజ్ ఇతనిది. ప్రస్తుతం 3 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్.
అలాగే తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ గురించి కూడా వికీపీడియాలో భారీగా సెర్చ్ లు జరిగాయి. ఇతని గురించి 15.82 మిలియన్ పీపుల్ సెర్చ్ చేయడం విశేషం. ప్రభాస్,విజయ్ ల తర్వాత 3 వ స్థానంలో మహేష్ బాబు కూడా నిలిచాడు.ఇతని గురించి 13.5 మిలియన్ పీపుల్ సెర్చ్ చేశారు. ఇక నాల్గవ స్థానంలో 12.9 మిలియన్స్ సెర్చ్ లతో రజినీకాంత్, 5వ స్థానంలో 12.6 మిలియన్స్ సెర్చులతో అల్లు అర్జున్ నిలవడం విశేషం. ఏమైనా టాప్ 5 లో టాలీవుడ్ నుండీ ముగ్గురు హీరోలు ఉండడం మామూలు విషయం కాదు.