ఎప్పుడూ చెప్పుకునే మాటే.. సంక్రాంతికి టాలీవుడ్‌లో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. అందుకే పెద్ద హీరోలు, కొత్త హీరోలు కూడా ఆ సీజన్‌లో సినిమాలు తీసుకురావడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా వచ్చే సంక్రాంతికి సినిమాలు రెడీ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాటలు చూస్తుంటే చాలానే సినిమాలు ఆ సీజన్ కోసం రెడీ అవుతున్నాయి అని అర్థమవుతోంది. కానీ పక్కాగా చూస్తే ఆ పరిస్థితి లేదు అని అంటున్నారు. గట్టిగా చూస్తే మూడు సినిమాలే సంక్రాంతికి (Sankranti 2025 Releases) వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
Sankranti 2025 Releases
సంక్రాంతి సినిమాలు (Sankranti 2025 Releases) అంటూ గత కొన్ని నెలలుగా చాలా పెద్ద పెద్ద పేర్లే వింటూ వస్తున్నాం. ఇదిగో, అదిగో అంటూ చాలా సినిమాలు డేట్స్ దాదాపు చెప్పేశాయి కూడా. అయితే గ్రౌండ్ రియాలిటీ, సినిమా టీమ్‌ల ప్లానింగ్ చూస్తుంటే వేరేలా అనిపిస్తోంది. ఇప్పుడు అనుకున్న లెక్క చూస్తుంటే మూడు సినిమాలు మాత్రమే బరిలో నిలిచేలా ఉన్నాయి. అవే చిరంజీవి(Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) , వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అవును మీరు చదివింది కరెక్టే.
పండక్కి వస్తాం, వస్తాం అని చెబుతున్న సినిమాలు అన్నీ సిద్ధంగా లేవట. కొన్ని సినిమాలు డిసెంబరులో బాక్సాఫీసు దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబరు 6న వస్తాం అని పక్కాగా చెబుతోంది. ఒకవేళ అప్పుడు రాకపోతే సంక్రాంతికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇక శంకర్ (Shankar) – రామ్‌చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ను (Game Changer) ఎట్టిపరిస్థితిలో 2024లో తీసుకొచ్చేయాలని ప్లాన్. కాబట్టి వాటి విషయం వదిలేయడమే.
ఇక సంక్రాంతికి వస్తాం అని చెబుతున్న బాలకృష్ణ (Balakrishna) – బాబీ (Bobby) సినిమాను డిసెంబరులోనే తెచ్చేస్తారట. నాగార్జున (Nagarjuna) వస్తానని చెప్పినా.. ఇంకా సినిమా పట్టాలెక్కలేదు. ఇక ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ‘జై హనుమాన్’ సినిమా ఇంకా మొదలవ్వలేదు. రవితేజ (Ravi Teja) , 75వ సినిమా అంటున్నారు కానీ.. రావడం డౌటే అంటున్నారు. దీంతో పండగ బరిలో రెండు తెలుగు + ఒక డబ్బింగ్ నిలుస్తాయి అని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఏదో ఒక చిన్న సినిమా ఉంటుంది అని అంటున్నారు.