Bhagyashri Borse: రిజల్ట్ తో సంబంధం లేని రెస్పాన్స్ ఎంజాయ్ చేస్తోన్న భాగ్యశ్రీ

సినిమా రిజల్ట్ అనేది ఎవర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఎవ్వరూ ఊహించలేని విషయం. ఒక్కోసారి సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా కూడా హీరోకి అద్భుతమైన పేరు తెచ్చుపెడుతుంది. రవితేజ్ నటించిన “నేనింతే” అందుకు నిదర్శనం. అయితే.. రవితేజ్  (Ravi Teja)  -హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో వచ్చిన “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan) బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రవితేజ, హరీష్ శంకర్ పై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. సినిమా రిజల్ట్ కంటే సదరు నెగిటివిటీ ఎక్కువ బాధించింది సదరు బృందాన్ని.

Bhagyashri Borse

అయితే.. ఈ రచ్చలో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా హ్యాపీగా తన స్క్రీన్ ప్రెజన్స్ కి వస్తున్న రెస్పాన్స్ తో ఫుల్ ఖుష్ అయిపోతుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) . ఆమె తెలుగు డెబ్యూ సినిమా కావడం, మొదటి లిరికల్ వీడియో రిలీజ్ నుండే ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ లా మారడం, సినిమాకి ఉన్న అతి తక్కువ ప్లేస్ పాయింట్స్ లో ఆమె గ్లామర్ కీ ఫ్యాక్టర్ కావడంతో ఆమెకు మాత్రం బోలెడు ఆఫర్లు వస్తున్నాయి.

ఆల్రెడీ తెలుగులో ఓ అయిదు సినిమాలు సైన్ చేసింది భాగ్యశ్రీ. మరికొన్ని సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. అయితే.. ఒక సినిమాతో నిర్మాత నష్టపోయి, దర్శకుడు సోషల్ మీడియాలో భారీ స్థాయి నెగిటివిటీ ఫేస్ చేసి, కథానాయకుడు సైలెంట్ గా కొత్త సినిమా చేసుకుంటుంటే.. హీరోయిన్ మాత్రం సినిమా విషయంలో హ్యాపీగా ఉండడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా.

మరి భాగ్యశ్రీ తనకు వచ్చిన ఈ ఫేమ్ ను సరిగ్గా వాడుకొని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా? లేక మూడు సినిమాల ముచ్చటగా మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి. అయితే.. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం సొంతం చేసుకొని.. మిగతా హీరోయిన్లందరూ కుళ్లుకొనేలా చేస్తోంది.

రామ్ తో సినిమా లేనట్టేనని వస్తున్న వార్తలు నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus