ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. రామానాయుడుగారు నిర్మాత అనే పదానికి ఒక మర్యాద తీసుకొస్తే.. ఆ మర్యాదను తన జడ్జ్ మెంట్ తో కంటిన్యూ చేసిన ఏకైక నిర్మాత ఎమ్మెస్ రాజు. ఆయన సంస్థ నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లిపోవచ్చు అనే మార్క్ సంపాదించుకున్న నిర్మాత ఆయన. “మనసంతా నువ్వే, నువ్వోస్తానంటే నేనోద్దంటానా, ఒక్కడు, దేవి” వంటి సినిమాతో సూపర్ హిట్స్ కొట్టడమే కాక అగ్ర నిర్మాతగానూ అలరారి.. అసంఖ్యాకమైన అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
అయితే.. తనకు కథల మీద ఉన్న కాన్ఫిడెన్స్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓ కన్నడ చిత్రాన్ని “వాన” అనే పేరుతో తెలుగులో రీమేక్ చేసి కాస్త గట్టిగానే దెబ్బతిన్నారు. ఆ తర్వాత తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన “తూనీగ తూనీగ” కూడా డిజాస్టర్ గా నిలవడంతో దర్శకుడిగా, ఫిలిమ్ మేకర్ గా ఎమ్మెస్ రాజు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. మరి మంచి సినిమాలు తీస్తే డబ్బులు రావడం లేదని బాధపడ్డారో లేక ప్రస్తుతం బీగ్రేడ్ సినిమాల కలెక్షన్స్ చూసి ఆశపడ్డారో తెలియదు కానీ.. “డర్టీ హరి” అనే సినిమాను తెరకెక్కించారు.
శ్రవణ్ రెడ్డి, రుహాని శర్మ, సిమ్రత్ కౌర్, సునీల్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అని ట్రైలర్ లో అర్ధమవుతున్నప్పటికీ.. శ్రుతిమించిన రోమాంటిక్ సీన్స్ మరియు సందర్భాలు కోకొల్లలు అని టేస్ట్ చూపించారు రచయిత-దర్శకులు ఎమ్మెస్ రాజు. అయితే.. ఆయన ట్రాక్ రికార్డ్ ప్రకారం మాత్రం ఈ చిత్రం ట్రైలర్ దిగజారినట్లే అనిపించింది. ఒక క్లాసిక్ ఫిలిమ్ మేకర్ నుండి ఇలాంటి బీలెవెల్ మాత్రం అస్సలు ఊహించలేదు. మరి రాజుగారి ప్రయత్నం ఈ సినిమాతోనైనా ఫలిస్తుందో లేదో చూడాలి.
చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!