Mukku Avinash wife Anuja: అవినాష్ ఇంట్లో విషాదం.. గర్భంలోనే బిడ్డ చనిపోయిందంటూ?

Ad not loaded.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ ఒకరు. ఈ కార్యక్రమంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇకపోతే 2021 వ సంవత్సరంలో అవినాష్ అనూజ అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల అవినాష్ భార్య అనూష ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా వీరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అనూష ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు అంతేకాకుండా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన వీడియోలను మేటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వబోతున్నాము అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

మరి కొద్ది రోజులలో ఈయన తండ్రి కాబోతుండగానే ఈయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది ఇదే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నేను ఏ విషయమైనా చెప్పాలి అనుకుంటే అది నా ఫ్యామిలీతో సమానమైన మీతో అన్ని విషయాలు పంచుకుంటానని. ఇక ఈ విషయం కూడా చెప్పే బాధ్యత నాదే కనుక అందరికీ ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ అవినాష్ అసలు విషయం వెల్లడించారు.

కొద్ది రోజులలో అమ్మానాన్నలుగా మారిపోతున్నామని ఎంతో సంతోషంగా ఉన్నాము కానీ కొన్ని కారణాలవల్ల మేము మా బిడ్డను కోల్పోయాము అంటూ అవినాష్ ఈ సందర్భంగా పురిటిలోనే తన బిడ్డ మరణించింది అనే విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటూ ఈయన ఈ విషయం చెప్పడంతో ఎంతోమంది రియాక్ట్ అవుతుంది తనకు ధైర్యం చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus