Kushi Movie: ‘ఖుషి’ పాటల వెనుక ఇంత కథ ఉందా? అసలేమైందంటే?

  • August 28, 2023 / 03:47 PM IST

‘ఖుషి’ సినిమా గురించి మాట్లాడటం మొదలుపెట్టగానే వచ్చే టాపిక్‌… ‘నా రాజా నువ్వే..’. సినిమాలోని ఈ పాటకు పిచ్చ ఫ్యాన్స్‌ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇప్పటికీ పాటను లూప్‌లో పెట్టి వింటూనే ఉన్నారు. నిజానికి ఆ పాటకు ఫ్యాన్ అవ్వడానికి ఆ సినిమా హీరోకో, హీరోయిన్‌కో ఫ్యాన్‌ అవ్వక్కర్లేదు. జస్ట్‌ మీరు సంగీత ప్రియులు అయితే చాలు. ఎందుకంటే అలాంటి వారికి ఆ పాట అంతగా నచ్చేసింది. ఈ పాటకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సంగీత దర్శకుడు హిషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ చెప్పారు.

విజయ్‌ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం (Kushi) ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అబ్దుల్ వాహబ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా కోసం నేను రెండేళ్ల పాటు కష్టపడ్డాను, నా కెరీర్‌లో అత్యధిక కాలం పని చేసిన సినిమా ఇదే అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ మణిరత్నం అభిమానిగా కనిపిస్తారని, అందుకే ‘నా రోజా నువ్వే…’ పాటలో మణిరత్నం సినిమా టైటిల్స్‌ వాడాం అని వాహబ్‌ వెల్లడించారు.

ఆ పాటను అలా తీర్చిదిద్దాలనే ఆలోచన దర్శకుడు శివ నిర్వాణదే అని, ట్యూన్‌ క్యాచీగా రావడంలో విజయ్‌ ఓ చేయి వేశారని కూడా చెప్పారు. ఇక ఈ సినిమాలో ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్‌ సవాలుగా అనిపించిందని చెప్పుకొచ్చారు. తొలుత ఆ ట్యూన్‌ను టీజర్‌ కోసమే అనుకున్నామని, కానీ, తర్వాత విజయ్‌, శివ పూర్తిస్థాయి పాటగా మారిస్తే బాగుంటుందన్నారని, అందుకే ఆ పాట బయటకు వచ్చిందన్నారు. అయితే పాట కోసం దాదాపు 25 వెర్షన్లు సిద్ధం చేశామని తెలిపారు.

ఇక అబ్దుల్‌ వాహబ్‌ సినిమాల లైనప్‌ చూస్తే.. ప్రస్తుతం నాని ‘హాయ్‌ నాన్న’, శర్వానంద్‌ – శ్రీరామ్‌ ఆదిత్య సినిమా, ‘స్పార్క్‌’ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. త్వరలో మరో ఇంట్రెస్టింగ్‌ తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus