Kushi: ‘ఖుషి’ గురించి మ్యూజిక్‌ డైరక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌… అసలు వాళ్లు వీళ్లు కాదంటూ…

  • August 28, 2023 / 10:45 PM IST

‘ఖుషి’ సినిమాలో హీరోహీరోయిన్లు? మాకెందుకు తెలియదు పవన్‌ కల్యాణ్‌, భూమిక అంటారు. అది రెండేళ్ల క్రితం వరకు. ఎందుకంటే ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన ‘ఖుషి’ ఇప్పుడు వేరే హీరోహీరోయిన్లు చేశారు. వాళ్లే విజయ్‌ దేవరకొండ, సమంత. ఆ లెక్కన ఇప్పటి ‘ఖుషి’ హీరోహీరోయిన్లు అంటే విజయ్‌, సమంత అని చెప్పాలి. కానీ ఆ సినిమా దర్శకుడు అబ్దుల్‌ హిషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ మాటలు చూస్తుంటే వీళ్లు కాదు అనిపిస్తోంది.

‘ఖుషి’ (Kushi) సినిమా ఎందుకు చూడాలి అంటే.. వచ్చే ఆన్సర్లలో తొలుతగా వచ్చేది విజయ్‌, సమంతల పెయిర్‌ అని చెప్పొచ్చు. ‘మహానటి’ సినిమాలో ఇప్పటికే ఈ ఇద్దరూ కలసి కనిపించినా.. ఇప్పుడు ‘ఖుషి’ వాళ్లు పండించిన రొమాన్స్‌ నెక్స్ట్‌ లెవల్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కోసం వెయిట్‌ చేసే వాళ్లలో ఎక్కువ మంది ఈ పెయిర్‌ కోసమే చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు వీళ్లిద్దరు మాత్రమే కాదు, వేరొకరు ఉన్నారు అని అన్నారు అబ్దర్‌ వాహబ్.

మలయాళంలో ‘సాల్ట్‌ మ్యాంగో ట్రీ’ అనే సినిమాలో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన… ‘హృదయం’ అనే సినిమాతో బాగా పాపులర్ అయిపోయారు. అలా సౌత్‌లో వరుస అవకాశాలు వచ్చాయి ఆయనకు. చాలా ప్రయత్నాల తర్వాత ఆయన ‘ఖుషి’ సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించారు. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయ్‌ – సమంత కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు.

అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరూ ఒకరిని మించి ఒకరు పోటీ పడి నటించారని, అయితే ఈ సినిమాలో మరో రెండు గొప్ప పాత్రలున్నాయని హింట్‌ ఇచ్చారు. నిజానికి ‘ఖుషి’ కథ వారిదేనని, వాళ్లే ఈ సినిమాలో స్పెషల్‌ అని కూడా చెప్పారు. అయితే అసలు విషయం మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పారు. థియేటర్‌ నుండి బయటకు వెళ్లగానే ప్రేక్షకుల మదిలో పాటలతో పాటు, మరో విషయం లోతుగా నాటుకుపోతుంది అని హైప్‌ పెంచేశారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus