ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు తయారయ్యింది ‘మైత్రి’ నిర్మాతల పరిస్థితి. అంత పెద్ద నిర్మాతలకు అలాంటి సిల్లీ కష్టాలు ఎందుకు వచ్చాయో ఈపాటికే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా చలామణి అవుతున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి బడా హీరోల సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు 2023 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
వీరి ప్రకటనలతో అభిమానులు హ్యాపీ. బాలయ్య- చిరు గతంలో సంక్రాంతి బరిలో పోటీపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ లు ఇచ్చే బయ్యర్లు.. ‘మైత్రి’ వారికి తలనొప్పి తెప్పిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలకు దాదాపు ఒకటే రేంజ్లో బిజినెస్ జరుగుతుంది. నిజానికి బాలయ్య కంటే చిరంజీవి మార్కెట్ రెండింతలు ఉండేది. కానీ ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ ఫలితాలతో చిరు సినిమాని ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
సరే ఇక మేటర్ లోకి వస్తే.. ఒకే బ్యానర్ నుండి రెండు సినిమాలు కనుక రిలీజ్ అయితే చాలా ఇబ్బంది ఎదురవుతుందని, ‘రెండు సినిమాలకు అడ్వాన్స్ లు ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు మేము లేము’ అంటూ బయ్యర్లు మైత్రి వారికి చెబుతున్నారట. ఒక సినిమాను కచ్చితంగా సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసుకోమని కూడా విన్నపించుకుంటున్నారట. అలా అయితేనే అడ్వాన్స్ లు ఇస్తామని తేల్చి చెప్పేస్తున్నారట. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ ఇంకో 20 రోజుల్లో ఫినిష్ అవుతుంది.
అయితే చిరు సినిమాకు ఇంకొంచెం టైం పట్టొచ్చు. కాబట్టి 2023 సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ‘ఆదిపురుష్’ ‘వారసుడు'(విజయ్) వంటి చిత్రాలు కూడా 2023 సంక్రాంతికే రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సినిమా కాబట్టి ‘ఆదిపురుష్’ కు ఎక్కువ థియేటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ‘వారసుడు’ మూవీ దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన మూవీ కాబట్టి.. దానికి కూడా ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటాడతను. కాబట్టి.. 2023 సంక్రాంతి రసవత్తరంగా మారనుంది అనడంలో సందేహం లేదు.