సంక్రాంతి పండుగ కానుకగా ఆలస్యంగా విడుదలవుతున్నా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా నా సామిరంగ అని నాగ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో విజయాలను అందుకున్న నాగ్ తనకు అచ్చొచ్చిన జానర్ లో నా సామిరంగ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే నా సామిరంగ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి కాలేదని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది.
32 కోట్ల రూపాయలకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. నాగార్జున ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ లో 75 శాతం నాన్ థియేట్రికల్ హక్కులతో వచ్చిన నేపథ్యంలో సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.
భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బ్లాక్ బస్టర్ హిట్లను సాధిస్తానని నాగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నాగార్జున నమ్మకాన్ని నా సామిరంగ నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. నాగ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు మంచి పేరు రాగా త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
అక్కినేని నాగార్జున త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. నా సామిరంగ సినిమాను చాలా ఏరియాలలో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి విజేతగా విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ (Naa Saami Ranga) సినిమా డిజిటల్ హక్కులు హాట్ స్టార్ సొంతం కాగా శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతమయ్యాయని సమాచారం.