Oscars 2023: ఆస్కార్ కు ఎంపికైన ‘నాటు నాటు’.. చరిత్ర సృష్టించిన ఆర్.ఆర్.ఆర్..ఆనందంలో ఫ్యాన్స్ !

  • January 24, 2023 / 07:42 PM IST

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 95వ అస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన సినిమాల జాబితాని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుండి ‘నాటు నాటు’పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అవ్వడం విశేషం. ఈ మధ్యనే కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ ఫంక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ’ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 2 రోజుల క్రితం జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌’కేటగిరిలోనూ అవార్డుని దక్కించుకుంది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం.

ఇంకో విశేషం ఏంటంటే.. అవతార్ -2, టాప్‌గన్‌: మావెరిక్ లాంటి పెద్ద పెద్ద హాలీవుడ్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ఆర్ఆర్ఆర్ మూవీ అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో అవార్డుని దక్కించుకోవడం ఇండియన్ సినీ పరిశ్రమకే గర్వకారణంగా చెప్పుకోవాలి. ఇక ఆస్కార్‌ నామినేషన్‌స్ లో ఇండియాకి చెందిన 10 సినిమాలు ఉన్నాయి.అవే ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతార, రాకెట్రీ, ఛల్లో షో, గంగూభాయి కతియావాడి, విక్రాంత్‌ రోణ, ది నంబీ ఎఫెక్ట్‌, మి వసంతరావ్‌,తుజ్యా సాథీ కహీ హై,ఇరవిన్‌ నిళల్‌.

గతేడాది చివర్లో వచ్చిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఆస్కార్‌ నామినేషన్ రేసులో నిలిచినా దానికి నిరాశే ఎదురైంది.ఇక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుందని సమాచారం. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఈ ఆనందానికి కొనసాగింపు దక్కుతుందో లేదో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus