టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో అండర్ రేటెడ్ సినిమాలు చాలా ఉంటాయి. అందులో ‘ఖలేజా’ (Khaleja) ఒకటి. ఎందుకో ఆ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. డిజాస్టర్ గా నిలిచింది. కానీ టీవీల్లో ఆ సినిమాని బాగా చూశారు. యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ‘ఖలేజా’ సినిమాకి మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదైన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ సినిమా హిందీ వెర్షన్ ని నార్త్ ఆడియన్స్ కూడా తెగ చూశారు.
త్రివిక్రమ్ (Trivikram), మహేష్ బాబు ఇద్దరూ కూడా కొత్తగా ట్రై చేసిన మూవీ ఇది. కానీ ఈ సినిమాని జనాలు రిలీజ్ టైంలో సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. అందుకు గల కారణాన్ని కూడా త్రివిక్రమ్ వివరించారు. ‘ఖలేజా’ అనే టైటిల్ పెట్టడంతో ఆడియన్స్ ఇదొక కంప్లీట్ మాస్ సినిమా అనుకున్నారు. కానీ థియేటర్ కి వచ్చి చూస్తే ‘దేవుడు అంటూ ఇంకో సబ్జెక్ట్ చెప్పడంతో ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోయారు’ అంటూ త్రివిక్రమ్ చెప్పడం జరిగింది.
ఇదిలా ఉండగా… దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తాజాగా ‘ఖలేజా’ గురించి చేసిన కొన్ని కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి. ఇటీవల నాగ్ అశ్విన్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఓ స్టూడెంట్… ‘వేరే దర్శకులు తీసిన సినిమాల్లో… ‘ఇది నేను డైరెక్ట్ చేసుకుంటే బాగుండేది’ అని అనిపించిన సినిమా ఏమైనా ఉందా?’ అంటూ నాగ్ అశ్విన్ ను ప్రశ్నించాడు. అందుకు నాగ్ అశ్విన్..
“నేను డైరెక్ట్ చేస్తే బాగుండేది అని కాదు కానీ.. నేను ఎడిట్ చేస్తే బాగుండేది అని అనిపించిన సినిమాలు 2,3 ఉన్నాయి. అందులో ‘ఖలేజా’ ఒకటి. దాన్ని నేను ఎడిట్ చేస్తే బాగుండేది అనిపించింది. అలాగే ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) కూడా” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ‘ఖలేజా’ లో ఎడిటింగ్ అనేది మేజర్ మైనస్ అని కూడా నాగ్ అశ్విన్ పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది.
‘ఖలేజా’ సినిమా నేను ఎడిట్ చేసుంటే బాగుండేది : నాగ్ అశ్విన్ @nagashwin7 @urstrulyMahesh #Trivikram #Trivikramsrinivas #KhalejaReRelease #khaleja #MaheshBabu #MaheshBabu @MaheshBabu_FC @MaheshBabuNews pic.twitter.com/c5flTxmoB2
— Phani Kumar (@phanikumar2809) April 15, 2025