అక్కినేని నాగార్జున.. ఈయన మంచి కథానాయకుడు మాత్రమే కాదు అద్భుతమైన బిజినెస్ మ్యాన్. రాజకీయనాయకులతో మంచి కాంటాక్ట్స్ మైంటైన్ చేయడంలో మన నవ మన్మధుడు సిద్ధహస్తుడు. తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.సి.పి, బీజేపీ ఇలా అన్నీ పార్టీలతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం ఒక్క నాగార్జునకు మాత్రమే చెల్లింది. కానీ.. ఇటీవల మోడీ చేసిన ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ను నాగార్జున పెడచెవిన పెట్టారు. అదేంటంటే.. ఓటు అనేది ప్రతి పౌరుడి ప్రాధమిక హక్కు అని ప్రజలకు తెలియజేయమని స్వయంగా ప్రధానమంత్రి మోడీ మన నాగార్జునను ట్విట్టర్ సాక్షిగా కోరాడు. నాగార్జున కూడా అందుకు సమ్మతించి తప్పకుండా అని బదులిచ్చాడు.
కానీ.. ఎలక్షన్స్ కి ముందు కానీ ఎలక్షన్స్ రోజు కానీ నాగార్జున ఎక్కడా ఓటు హక్కు గురించి మాట్లాడడం లేదా ట్వీట్ చేయడం కానీ జరగలేదు. పైగా.. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ దగ్గర నాగార్జున కనిపించకపోవడమే కాక కనీసం ఓటేసినట్లు కూడా ఎక్కడా ట్వీట్ చేయలేదు. దాంతో ఓటరుకి ఓటు వినియోగించుకోమని చెప్పడం పక్కన పెడితే.. అసలు నాగార్జున తన ఓటు హక్కునే వినియోగించుకోలేదని.. ప్రధాన మంత్రి రిక్వెస్ట్ ను ఖాతరు చేయలేదని తెలుస్తోంది. మరి పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ విషయం చర్చనీయాంశం అయ్యింది.