చైతు, స్యామ్ వివాహం రద్దుకావడానికి కారణం ఏంటి?
- December 3, 2016 / 01:40 PM ISTByFilmy Focus
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమకు అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చారు. నాగ చైతన్య పెళ్లికి కొంతకాలం సమయం అడిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. టైమ్ అడగడానికి కారణం సమంత తల్లిదండ్రులు అని తాజాగా తెలిసింది. వారికి చైతూని అల్లుడిగా చేసుకోవడం ససేమిరా ఇష్టం లేదంట. కూతురు బాధపడుతుందని ఆమె మొహం మీద ఇప్పటివరకు వారు చెప్పలేకపోయారు. పెళ్లి అనే మాట వచ్చినప్పుడల్లా ఏదో వంక చెబుతూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు.
ఆరు నెలలుగా ఇలాగే ఇబ్బంది పెడుతుండడంతో సమంత ఇంట్లో నుంచి బయటికి వచ్చి, నాగ చైతన్య ఇంటికి చేరుకుంది. దీంతో సమంత పేరెంట్స్ ఆగ్రహంతో “నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.. మేము పెళ్లికి రాము” అని చెప్పడంతో స్టోరీ మళ్లీ మొదటికి వచ్చింది. వియ్యంకులు వారిని నచ్చచెప్పడానికి కింగ్ నాగార్జున రంగంలో దిగినట్లు సమాచారం. నాగ్ మాటలను వారు వింటారా?, లేక ఈ గొడవ మరింత పెద్దదవుతుందా? అని సినీ వర్గీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల నడుమ నాగచైతన్య, సమంత పెళ్లి జరగాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















