అక్కినేని హీరోల్లో అందరికంటే కూడా నాగచైతన్య (Naga Chaitanya) కాస్త స్పీడ్ పెంచుతున్నాడు. ఈసారి ఏకంగా 100 కోట్లు కాదు అంతకంటే పెద్ద టార్గెట్ ను సెట్ చేసుకున్నాడు. తండేల్ సినిమా అతని మార్కెట్ కు చాలా ఇంపార్టెంట్. కెరీర్ మొదటి నుంచి కూడా బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న చైతూకి ఇప్పటివరకు ఇలాంటి అవకాశం దొరకలేదు. తండేల్ ను (Thandel) పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో నార్త్ లో కూడా సక్సెస్ చూసిన దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) నుంచి వస్తున్న తదుపరి సినిమా కావడంతో హిందీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
Naga Chaitanya
ఇక సాయి పల్లవి (Sai Pallavi) ఆమరన్ తో (Amaran) కోలీవుడ్ లో సాలీడ్ హిట్ కొట్టింది. మలయాళంలో ఎలాగూ క్రేజ్ ఉంది. ఇక కన్నడలో కంటెంట్ బాగుంటే స్టార్స్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి. కాబట్టి అన్ని వైపులా తండేల్ కు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా హిట్టయితేనే తరువాత సినిమాలకు ధైర్యం కలుగుతుంది. ముఖ్యంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్న కార్తిక్ దండు ప్రాజెక్ట్ కు కూడా తండేల్ రిజల్ట్ కీలకం కానుంది.
వీరుపాక్ష సినిమాతో 100 కోట్ల హిట్టు చూసిన ఈ దర్శకుడు మిస్టరీ ట్రెండును బాగా హ్యాండిల్ చేయగలడని అర్థమైంది. ఇక NC24లో కూడా అలాంటి ఎలిమెంట్స్ లేటెస్ట్ ట్రెండుకు తగ్గట్టుగా ఉంటాయని అర్ధమవుతుంది. SVCC తో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం మరో ప్లస్ పాయింట్. ఇక తండేల్ పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కయితే NC24కి బూస్ట్ లబించినట్లే.
ఏదేమైనా తండేల్ – NC24.. రెండూ కూడా నాగచైతన్య కెరీర్ ను మలుపు తిప్పే సినిమాలే. నాగచైతన్య తన మార్కెట్ ను పెంచుకోవడానికి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరి అక్కినేని హీరో లక్కు ఈసారి ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.