‘హమ్మయ్య హీరోయిన్ ఓకే అయిపోయింది’, మహేష్‌బాబు (Mahesh Babu) పాస్ పోర్ట్ సీజ్ కూడా రాజమౌళి (S. S. Rajamouli) చేసేశారు. ఇంకేముంది అన్నీ ఓకే సినిమా స్టార్ట్ చేసేయడమే. మహేష్‌బాబు ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. అయితే వారందరికీ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం పుకారు దశలోనే ఉన్న ఈ సమాచారం దాదాపు నిజమయ్యేలా ఉంది అని అంటున్నారు. అదే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కాదు అని. అదేంటి ఆమె ‘ఫైనల్లీ’ అని రాజమౌళి పోస్టుకు రిప్లై ఇచ్చింది కదా అనుకంటున్నారా?
Priyanka Chopra
ఆమె రిప్లై ఇవ్వడం కరెక్ట్. ఆ సినినమాలో ఆమె నటిస్తుండటం కరెక్ట్. కానీ మహేష్‌బాబు సరసన ఆమె నటించదు అని చెబుతున్నారు. దీనికి కారణం రాజమౌళి లాస్ట్ మినిట్‌లో స్క్రిప్ట్‌లో చేసిన కొన్ని మార్పులే కారణం అని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఉందని.. దాని కోసం యంగ్ హీరో కోసం చూస్తున్నారు అని తొలుత వార్తలొచ్చాయి. ఎవరు నటించొచ్చు అనే చర్చ కూడా నడిచింది. అయితే ఆ హీరో పాత్రను హీరోయిన్‌గా మార్చేశారు అంటున్నారు.
అంటే మహేష్‌బాబుతో సమానంగా యాక్షన్ సీన్స్, కీలకమైన సీన్స్‌లో ప్రియాంక చోప్రా కనిపిస్తుందట. మహేష్ లవ్ ఇంట్రెస్ట్ మరో యంగ్ హీరోయిన్‌ని ఓకే చేసే పనిలో ఉన్నారట. ఈ మేరకు హాలీవుడ్ యువ భామనైనా తీసుకోవచ్చు అని అంటున్నారు. అయితే ఇండియన్ లుక్స్‌కి దగ్గరగా ఉండే అమ్మాయి కోసం వెతుకులాట జరుగుతోంది అని సమాచారం. దీంతో మహేష్ – ప్రియాంక జోడీ అంత కలర్‌ఫుల్‌గా లేదు అని బాధపడుతున్న కొంతమంది ఫ్యాన్స్‌కి ఇది ఊరటనిచ్చే అంశమే అని చెప్పొచ్చు.
సీనియర్ హీరో, సీనియర్ హీరోయిన్ కాంబినేషన్ మన జనాలకు ఇటీవల పెద్దగా ఎక్కడం లేదు. హీరో వయసు ఎంత ఉన్నా హీరోయిన్ బిలో 30 ఉండాల్సిందే అంటున్నారు. కానీ ప్రియాంక వయసు ఎబో 40. అందుకే అలా అనుకుని ఉంటారు. చూద్దాం మరి రాజమౌళి ఏ హీరోయిన్‌ని తీసుకొస్తారో? అసలు ఈ రూమర్ నిజమవుతుందో లేదో?