Naga Chaitanya: డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నాగచైతన్య దూత!

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన దూత అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని కూడా చాలా కాలం అయినప్పటికీ అమెజాన్ వారు మాత్రం ఈ వెబ్ సిరీస్ విడుదల చేయలేదు. ఇలా ఈ వెబ్ సిరీస్ విడుదల చేయకపోవడానికి గల కారణాలు తెలియకపోయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ మాత్రం విడుదలకు నోచుకోలేదు.

అయితే తాజాగా నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ గురించి పలు విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ దూత వెబ్ సిరీస్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇతర భాషలలో కూడా డబ్ చేస్తున్న కారణంగా కాస్త ఆలస్యమైందని అయితే కొద్దిరోజుల క్రితం నేను ఈ టీం ను కూడా కలిశానని తెలిపారు.

ఇక ఈ వెబ్ సిరీస్ ఆగస్టులో స్ట్రీమింగ్ కానుంది అంటూ నాగచైతన్య తెలియజేశారు. ఇలా నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే దూత వెబ్ సిరీస్ ఆగస్టు నెలలో విడుదల కానుందని తెలుస్తుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇన్ని రోజులపాటు విడుదల చేయకపోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది.

నాగచైతన్య (Naga Chaitanya) గతంలో నటించిన థాంక్యూ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కలిసిన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆ సమయంలో ఈ వెబ్ సిరీస్ విడుదల చేస్తే ఈ సిరీస్ పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సిరీస్ కొద్ది రోజులపాటు వాయిదా వేశారని తెలుస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus