Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
- June 19, 2025 / 06:39 PM ISTByPhani Kumar
నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు తన 24వ సినిమాని ‘విరూపాక్ష’ (Virupaksha) దర్శకుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu) తో చేస్తున్నాడు. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ మూవీ. మీనాక్షి చౌదరి ఇందులో చైతన్యకి జోడీగా నటిస్తోంది. ఈరోజు నుండి గుజరాత్ లో ఓ కీలక షెడ్యూల్ ప్లాన్ చేశారు. హీరో నాగ చైతన్య (Naga Chaitanya) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), కమెడియన్ పవన్ కుమార్ అల్లూరి పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Naga Chaitanya
ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ ను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad), బాపినీడు (Vijaya Bapineedu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో నాగవంశీ (Naga Vamsi) థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ఓటీటీ ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. నాగ చైతన్య 25వ సినిమా గురించి ఇప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి.

తన ల్యాండ్ మార్క్ మూవీని నాగ చైతన్య ఏ దర్శకుడితో చేస్తాడు? అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఈ క్రమంలో శివ నిర్వాణ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ నాగ చైతన్య- శివ నిర్వాణ కాంబినేషన్లో ‘మజిలీ’ (Majili) వచ్చింది. అది చైతన్య కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇప్పుడు చైతన్యకి మరో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు శివ నిర్వాణ. ఇక చైతన్య వద్ద ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి అడ్వాన్స్ ఉంది.

సో ఈ కాంబోలో ‘NC25’ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. చందూ మొండేటి కూడా నాగ చైతన్య (Naga Chaitanya) కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్యకి చందూ మొండేటి పై నమ్మకం ఎక్కువ. పైగా నాగార్జున (Nagarjuna) కి ఫ్యాన్ బాయ్ కూడా. ఆల్రెడీ చైతన్యతో ‘ప్రేమమ్’ (Premam) ‘సవ్య సాచి’ (Savyasachi) ‘తండేల్’ (Thandel)చేశాడు. నాగ చైతన్యని మాస్ గా చూపించడానికి చందూ మొండేటి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కాబట్టి చైతన్య తన 25వ సినిమాకి చందూ మొండేటిని ఫైనల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
















