Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?
- June 19, 2025 / 05:38 PM ISTByPhani Kumar
తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)… ‘సార్’ (Vaathi) తర్వాత చేసిన మరో తెలుగు స్ట్రైట్ మూవీ ‘కుబేర’ (Kuberaa) . శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ‘కింగ్’ నాగార్జున (Nagarjuna) కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు. సినిమాలో నాగార్జున (Nagarjuna) పాత్ర కూడా అతి కీలకమైనది అని తెలుస్తుంది. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు , శేఖర్ కమ్ముల (Sekhar Kammula) .. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Kuberaa First Review
రష్మిక మందన.. ధనుష్ (Dhanush) సరసన నటించింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. టీజర్, ట్రైలర్.. వంటివి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ‘కుబేర’ (Kuberaa) ఇంకో ఎత్తు. ఎందుకంటే.. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఇప్పటివరకు చేసిన సినిమాలు లో- బడ్జెట్ లో రూపొందినవి. స్టార్స్ తో ఆయన ఇదివరకు పనిచేసింది లేదు. టెక్నికల్ టీం కూడా కొత్తవాళ్లే ఎక్కువగా ఉంటారు. సంగీత దర్శకుడితో సహా..! కానీ ‘కుబేర’ (Kuberaa) లో ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika Mandanna) వంటి స్టార్స్ నటించారు.

అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అందుకే ‘కుబేర’ (Kuberaa) స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ఏషియన్ సునీల్ ‘కుబేర’ (Kuberaa) ని చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 3 గంటల 2 నిమిషాల వరకు ఉందట. మొదటిసారి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తన కంఫర్ట్ జోన్ ని పక్కన పెట్టి.. తీసిన సినిమా ఇది అంటున్నారు. అలా అని అతని బ్రాండ్ మార్క్ సెన్సిబిలిటీస్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడినట్టు చెబుతున్నారు.

‘రాజకీయ నాయకులు స్కాములు చేసి సంపాదించిన బ్లాక్ మనీని.. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఓ బిచ్చగాడి పేరుపై రాస్తే.. తర్వాత ఆ రాజకీయ నాయకులకి ఎలాంటి ఇబ్బందులు వచ్చి పడ్డాయి, ఆ బిచ్చగాడి లైఫ్ ఏమైంది?’ అనే పాయింట్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) ఇద్దరూ పోటాపోటీగా నటించారట. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డిటెయిలింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ .. సినిమాకు హైలెట్స్ అని అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.















