Naga Chaitanya, Samantha: సమంత తో విడాకులు.. మొదటిసారి నేరుగా స్పందించిన చైతన్య..!

2017 లో ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య, సమంతలు…నాలుగేళ్ళ పాటు హ్యాపీగా కలిసుండి ఎవ్వరూ ఊహించని విధంగా 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ‘చైసామ్’ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి ఆ ముందు నుండీ ఈ విషయం పై అనే వార్తలు బయటకి వచ్చాయి. ఇవి అబద్దం అయితే బాగుణ్ణు అని చైసామ్ అభిమానులు కోరుకున్నారు. దానికి తోడు పలుసార్లు ఇది అబద్దమన్నట్టు చైతన్య, సమంత లు రియాక్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ కొంత మేర ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేశారు.

అయిన నిజం బయటపడడం ఆలస్యం అవుతుంది కానీ బయటపడడం అసంభవమేమి కాదు కదా..! వారికి ఆ షాక్ అక్టోబర్ 2న గట్టిగా తగిలింది. చైసామ్ విడాకులు ప్రకటించగానే.. చైతన్య అభిమానులు సమంతని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇప్పటికీ ఆ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. విడాకులు అయిన ఇన్ని నెలలకి నాగ చైతన్య మొదటి సారి ఈ విషయం పై స్పందించాడు. ‘బంగార్రాజు’ ప్రమోషన్లలో భాగంగా విలేకర్లతో మాట్లాడిన నాగ చైతన్యకి..

సమంతతో విడాకుల గురించి ప్రశ్నలు ఎదురైయ్యాయి. వాటికి.. ‘ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం ఇది, ఇప్పుడు నేను హ్యాపీ.. తానూ హ్యాపీ. ఇదే బెస్ట్ డెసిషన్’ అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య. ఇక వీరి విడాకులకి ‘ఫ్యామిలీ మెన్’ అనే వెబ్ సిరీసే కారణమనేది చాలా మంది అభిప్రాయం. అందులో సమంత మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించినందుకు గాను ఫ్యామిలీ లైఫ్ లో గొడవలు స్టార్ట్ అయినట్టు అనేక వార్తలు వచ్చాయి.

ఓ సందర్భంలో నాగ చైతన్య కూడా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చి పెట్టే పాత్రలు చేయను అని చెప్పడం కూడా దీనికి నిదర్శనమనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఏదైతేనేం.. అటు చైతన్య కానీ ఇటు సమంత కానీ వరుస సినిమాల్లో నటిస్తూ హ్యాపీగా కాలం గడుపుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus