Naga Chaitanya, Samantha: చైసామ్ డివోర్స్ మేటర్ ను కంపు చేస్తున్న పర్సనల్ టీం!

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనే సామెత ఎందుకు పుట్టుకొచ్చింది అనేది మొన్నటివరకూ సరిగా అర్ధమయ్యేది కాదు కానీ.. ఇప్పుడు చైసామ్ డివోర్స్ మేటర్ లో జరుగుతున్న రచ్చకి ఆ సామెత కరెక్ట్ అనిపిస్తుంది. ఇద్దరు సెలబ్రిటీలు తమకి ఒకరితో ఒకరికి పొసగదు అని సైలెంట్ గా వేరయ్యారు. ఆ విషయం ప్రపంచానికి తెలియాలి కాబట్టి ఓ ట్వీట్ వేశారు. అంతే అప్పట్నుంచి పలు టీవీ ఛానల్స్ అదే పనిగా ఆ ఇష్యూని రకరకాలుగా కవర్ చేస్తూనే ఉన్నాయి.

అయితే.. అటు సమంత కానీ.. ఇప్పుడు నాగచైతన్య కానీ మీడియాకి దొరక్కపోవడంతో ఎవరి కోట్స్ తీసుకోలేక నానా ఇబ్బందులు పడుతోంది. ఈ తరుణంలో సమంత పర్సనల్ టీం మెంబర్స్ కొందరు పెడుతున్న ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నిప్పుకు ఆద్యం పోస్తున్నట్లుగా తయారయ్యాయి. అసలు వాళ్లెందుకు విడిపోయారో ఇప్పటివరకూ క్లారిటీ లేదు కానీ.. ఈ మేకప్ & స్టైలింగ్ అసిస్టెంట్స్ పుణ్యమా అని వాళ్ళకి ఒక అమ్మాయి విషయంలో గొడవలు జరిగాయని తేటతెల్లమవుతుండగా..

ఆ ఇష్యూని కవర్ చేయడం కోసం అక్కినేని సపోర్టర్స్ బ్యాచ్ రంగంలోకి దిగి రకరకాల ఇన్స్టా స్టోరీస్ పెట్టడం ఎక్కడలేని కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది తెలియదు కానీ.. ఇద్దరి పర్సనల్ టీమ్స్ & ఫ్రెండ్స్ మాత్రం ఈ ఇష్యూని కంపు కంపు చేస్తున్నారు. ఇకనైనా సదరు టీమ్స్ & ఫ్రెండ్స్ చైసామ్ ల డివోర్స్ మేటర్ గురించి పనికిమాలిన పోస్టులు, స్టోరీలు పెట్టి మాని తమ పని తాము చూసుకుంటే బెటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus