చైతన్య అలా చేస్తే సామ్ ఇలా చేసిందా.. ప్రేమ లేదంటూ?

ఏ మాయ చేశావె సినిమాతో సమంత నాగచైతన్యల మధ్య పరిచయం ఏర్పడింది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై నేటికి 13 సంవత్సరాలు అయింది. ఈ సినిమా అటు నాగచైతన్యకు ఇటు సమంతకు స్పెషల్ మూవీ కావడం గమనార్హం. ఈ సినిమా గురించి సమంత చైతన్య వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు.

విడాకుల తర్వాత చైతన్య సమంతతో కలిసి దిగిన పోస్టర్ ను షేర్ చేయగా సమంత మాత్రం కేవలం జెస్సీ పాత్రకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. తెలుగులో ఈ సినిమాతోనే అటు చైతన్యకు, ఇటు సమంతకు తొలి సక్సెస్ దక్కింది. ప్రస్తుతం చైతన్య, సమంత వేర్వేరుగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సమంతకు చైతన్యపై అణువంతైనా ప్రేమ లేదని అందుకే ఇలా చేసిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

చైతన్య, సమంత భవిష్యత్తులో కూడా ఒకే ప్రాజెక్ట్ లో కలిసి కనిపించే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాయ చేశావె సినిమాలో చైతన్య కార్తీక్ రోల్ లో నటించి మెప్పించగా సమంత జెస్సీ రోల్ కు ప్రాణం పోశారు. ఆ తర్వాత రోజుల్లో ఈ కాంబినేషన్ లో మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాలు తెరకెక్కాయి. ఆటోనగర్ సూర్య మినహా మిగతా సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.

చైతన్య, సమంత విడిపోయినా విడాకులకు సంబంధించిన విషయాలేవీ వెల్లడించడం లేదు. ఎందుకు విడిపోయారనే కారణం బయటి ప్రపంచానికి తెలియదు. మనస్పర్ధల వల్లే వాళ్లు విడిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చైసామ్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చైతన్య ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా సమంత 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus