Naga Chaitanya: పరశురామ్ నా టైం మొత్తం వేస్ట్ చేశారు!

  • May 8, 2023 / 02:51 PM IST

గీత గోవిందం సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు పరశురామ్. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ పరశురాం నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ క్రమంలోనే నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య పరశురామ్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా నాగచైతన్య డైరెక్టర్ గురించి మాట్లాడుతూ అతడి గురించి మాట్లాడటం చాలా టైం వేస్ట్.. పరుశురాం నాకు చాలా టైం వేస్ట్ చేశారు.ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదంటూ చెప్పేశారు.

పరశురాం గతంలో నాగచైతన్యకు ఒక సినిమా స్టోరీ వినిపించారు. అయితే ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాగచైతన్య సంతృప్తి లేరట అందుకే ఈ సినిమా నుంచి నాగచైతన్య తప్పుకున్నారని తెలుస్తోంది. ఇక నాగచైతన్య ఈ సినిమా వద్దని చెప్పడంతో అదే కథతో పరుశురామ్ తిరిగి విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లారని సమాచారం.

ఇక తన సినిమాల గురించి నాగచైతన్య మాట్లాడుతూ నేను కానీ అఖిల్ కానీ ఫలానా డైరెక్టర్ తో సినిమా చేయాలని చెబితే వెంటనే నాన్న వారి ఆఫీసుకు వెళ్లి సినిమా ఫిక్స్ చేస్తారు. అయితే మీకు ఏ డైరెక్టర్లతో చేయాలని ఉంది చెప్పండ్రా అంటూ నాన్న చాలా సార్లు అడిగారని,కానీ మా కాళ్ళపై మేము నిలబడాలన్న ఉద్దేశంతో ఈ విషయంలో నాన్నని ఇన్వాల్వ్ చేయము అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus