టాలీవుడ్ ప్రేమపక్షులు అక్కినేని నాగచైనత్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్ల ప్రేమకథ గురించి చాలా తక్కువమందికే తెలుసు. అయితే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు అందరికీ తెలుసు. పెళ్లికి ముందు చైతుని ఎప్పుడు అడిగినా మాట దాటేశాడు. శోభిత కూడా అంతే. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రేమకథ గురించి కొంచెం కొంచెం చెబుతున్నారు. అలా ఇటీవల మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే ప్రేమ గురించి వాళ్ల అభిప్రాయాలు కూడా చెప్పుకొచ్చారు.
ప్రేమలో క్షమాపణ, కృతజ్ఞతలు చెప్పడం అనేవి ఉండవు అని శోభిత అంటోంది. ఇదంతా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘టెల్ ది ట్రూత్’ అంటూ ఆ ఇంటర్వ్యూలో ఓ సెషన్ పెట్టగా.. చైతు, శోభిత సరదా సమాధానాలు ఇచ్చారు. పేరిట నిర్వహించిన చిట్‌చాట్‌లో సరదాగా సమాధానాలిచ్చారు. వాటిలోని కొన్ని ఇవీ.. తప్పు లేకపోయినా ముందుగా సారీ ఎవరు చెబుతారు? అని అడిగితే నేనే అని శోభిత చెప్పింది.
దానికి చైతు నువ్వు సారీ, థాంక్స్ పట్టించుకోవు కదా అని కౌంటర్ వేశాడు. వెంటనే శోభిత ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలు ఉండవు అని కంప్లీట్ చేసింది. ఇక వంట సంగతేంటి అని అడిగితే.. ఇద్దరమూ కుక్ చేయం అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే తన కోసం చైతూ హాట్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తాడని శోభిత అంది. దానికి హాట్ చాక్లెట్స్, కాఫీ ప్రిపేర్ చేయడం కుకింగ్ కిందకు రాదు అని కౌంటరేశాడు చైతన్య. శోభిత ఎప్పుడూ ప్రశాంతంగా తినాలని అనుకుంటుందని, తినే సమయంలో మాట్లాడిస్తే తనకు నచ్చదని చైతన్య చెప్పాడు.
చైతూ తన ఫేవరెట్ బైక్ క్లీనింగ్‌కు రెండు గంటలు కేటాయిస్తాడని శోభిత కొత్త విషయం చెప్పుకొచ్చింది. మరి ప్రేమ సంగతి ఏంటి అంటే.. ‘‘ఓ సారి సోషల్ మీడియాలో చిట్‌చాట్ చేస్తుంటే.. ‘మీరెందుకు నాగచైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం లేదు?’ అని ఒక నెటిజన్ అడిగాడట. అప్పుడు చూస్తే అప్పటికే చైతన్య తనను ఫాలో అవుతున్నాడు అని తెలిసిందట. అలా తమ రిలేషన్ మొదలైంది అని శోభిత తెలిపింది.