Naga Chaitanya: తొలిసారిలో అలాంటి పాత్రలో నటిస్తున్న చైతన్య.. కానీ?

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో చైతన్య బాబు అనే జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నారని బోగట్టా. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో పాజిటివ్ రోల్స్ లో ఎక్కువగా నటించిన నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లో మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ కోసం ఎంత రిస్క్ అయినా చేసే పాత్రలో చైతన్య కనిపించనున్నారు.

చైతన్య పాత్ర కొత్తగా ఉంటుందని యాక్టింగ్ విషయంలో చైతన్య పాత్ర నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని బోగట్టా. చైతన్య నటన కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించేలా ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. అక్కినేని హీరో ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. చైతన్యకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఒక్కో ప్రాజెక్ట్ కు 10 కోట్ల రూపాయల రేంజ్ లో చైతన్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో చైతన్య ఖాతాలో సక్సెస్ చేరగా థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. కెరీర్ పరంగా చైతన్య మరోసారి జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. తర్వాత సినిమాలతో చైతన్య బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాల్సి ఉంది.

చైతన్య సినీ కెరీర్ ను పరిశీలిస్తే క్లాస్ సినిమాలు మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ ను ఇచ్చాయి. చైతన్య స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని కొంతమంది అభిమానులు సూచనలు చేస్తున్నారు. మల్టీస్టారర్లు కూడా నాగచైతన్యకు కలిసొచ్చాయి. పరశురామ్ దర్శకత్వంలో ఒక మూవీలో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మరో మూవీలో చైతన్య నటిస్తుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus