Naga Chaitanya: థాంక్యూ విషయంలో చైతూ ప్లాన్ ఇదేనా?

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నాగచైతన్య థాంక్యూ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపిస్తున్నారు. ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా నవంబర్ నెల నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి.

ఈ సినిమాతో పాటు నాగచైతన్య బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా బంగార్రాజు సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. 2022 సంవత్సరం వేసవిలో థాంక్యూ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు చైతన్య లాల్ సింగ్ చద్దాలో కూడా నటిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న విక్రమ్ కె కుమార్ ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాలు సక్సెస్ సాధించలేదు.

హలో, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో థాంక్యూ సినిమాతో హిట్ కొట్టాలని విక్రమ్ కె కుమార్ అనుకుంటున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమాతో మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ థాంక్యూతో భారీ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. దిల్ రాజు రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus