విజయ్ దేవరకొండకి 7 ఏళ్ళుగా సరైన హిట్టు లేదు. అతని చివరగా హిట్టు కొట్టింది ‘టాక్సీవాలా’ సినిమాతో.దాని తర్వాత అతను చేసిన ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ‘ఖుషి’ ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. దీంతో విజయ్ రేసులో వెనుకబడ్డాడు. ఫాస్ట్ గా వంద కోట్ల క్లబ్ లో చేరిన విజయ్.. ఆ తర్వాత వెనుకబడటానికి కారణాలు చాలా ఉన్నాయి.
కానీ ప్రధానంగా అందరూ వేలెత్తి చూపించేది అతని ఆటిట్యూడ్ గురించి. ‘అర్జున్ రెడ్డి’ టైంలో చేసిన ఓపెన్ ఛాలెంజులు వర్కౌట్ అయ్యాయి కదా అని.. ప్రతి సినిమా ఈవెంట్లో కూడా అలాంటి హడావిడి చేయడం ‘ఓవర్ ది టాప్’ అయ్యింది. అందువల్ల విజయ్ ను ఓ సెక్షన్ ఆఫ్ మీడియా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం.. అతని సినిమాలపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది.
వాస్తవానికి స్టేజీల పై విజయ్ స్పీచ్..లకి, అతని నిజ జీవితానికి సంబంధం ఉండదు. ఈ విషయాన్ని ఒక సందర్భంగా విజయ్ సైతం అంగీకరించాడు. ‘ ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ టైంలో నాగబాబు… విజయ్ ను మరోలా ఊహించుకున్నారు, కానీ తర్వాత విజయ్ ప్రవర్తన చూసి ‘నువ్వు మంచోడివే కదయ్యా.. మరి ఎందుకు నీ గురించి ఇలాంటి ఇమేజ్ ఉంది’ అని స్వయంగా విజయ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. సో విజయ్ దేవరకొండ టీం అలా అతని స్పీచ్..లను డిజైన్ చేస్తుందేమో అని అంతా అనుకుంటున్నారు. అలాంటి వాటికి నాగవంశీ చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ప్రమోషన్స్ లో కానీ విజయ్ చాలా వినయంగా కనిపించాడు. ఎక్కడా కూడా ఓవర్ ది టాప్ వెళ్ళలేదు. ఇదంతా నాగవంశీ తీసుకున్న జాగ్రత్త అని తెలుస్తుంది.