మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని భావించినా కొన్ని కారణాల వల్ల 2009 ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాలేదు. తక్కువ స్థానాలలోనే ప్రజారాజ్యం విజయం సాధించడంతో పాటు తర్వాత రోజుల్లో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీ విలీనం జరిగింది. అయితే జనసేన గురించి గతంలో పెద్దగా ప్రస్తావించని చిరంజీవి తాజాగా జనసేనకు తన మద్దతు ఉంటుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. తాను పాలిటిక్స్ కు దూరంగా ఉండటం పవన్ కు ఉపయోగపడుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
పవన్ రేంజ్ ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని రాబోయే రోజుల్లో పవన్ కు మద్దతు ఇస్తానేమో అని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. చిరంజీవి జనసేనలోకి వస్తే జనసేన పరిస్థితి మెరుగుపడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాజకీయ విశ్లేషకులు సైతం చిరంజీవి, పవన్ కలిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాగబాబు పవన్ పాలిటిక్స్ గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య చిరంజీవి మాట్లాడిన మాటలు కోట్ల సంఖ్యలో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయని నాగబాబు అన్నారు.
తమ్ముడు పవన్ కు మేలు జరుగుతుందని అన్నయ్య రాజకీయాలకు దూరంగా ఉన్నారని నాగబాబు కామెంట్లు చేశారు. అన్నయ్య ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ పాలనా పగ్గాలు చేపడతాడని నాగబాబు అన్నారు. అన్నయ్య ఆకాంక్షలను నెరవేర్చడానికి జనసైనికులు కష్టపడతారని నాగబాబు చెప్పుకొచ్చారు. కార్యకర్తల సమావేశంలో నాగబాబు వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుందో చూడాలి.
జనసేన గెలుపు కోసం జనసైనికులు తమ వంతు కష్టపడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలోని ఎన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.