Nagababu: చరణ్ విషయంలో ఆ భాద మొత్తం తీరిపోయింది: నాగబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా అడుగు పెట్టారు మొదటి సినిమాతో ఎంతో మంచి విజయం అందుకున్న రామ్ చరణ్ అనంతరం మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా వరుసగా రెండు సినిమాలతో సూపర్ జోష్ లో ఉన్నటువంటి ఈయన తరువాత నాగబాబు నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమా చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా భారీ నష్టాలను కూడా తీసుకురావడంతో నిర్మాత నాగబాబు ఎంతో నష్టపోయారు. అయితే అప్పట్లో ఈయనకు చిరంజీవి పవన్ కళ్యాణ్ చాలా అండగా నిలిచారని నాగబాబు (Nagababu) పలు సందర్భాలలో తెలియజేశారు.ఇలా 2010వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని తిరిగి విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ రావడంతో నాగబాబు  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… ఆరెంజ్ సినిమా తిరిగి విడుదల చేద్దాము అని చెప్పినప్పుడు కాస్త ఆలోచించాను. అయితే ఈ సినిమా తిరిగి విడుదల అయినప్పటికీ ఎంతో అద్భుతమైన ఆదరణ లభిస్తోందని ఏకంగా 75 లక్షల గ్రాస్ వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచిందని నాగబాబు ఎమోషనల్ అయ్యారు. ఇక చిరుత మగధీర వంటి సూపర్ సక్సెస్ లో ఉన్నటువంటి చరణ్ కు ఆరెంజ్ సినిమా ద్వారా ఫ్లాప్ సినిమా అందించానని చాలా బాధపడ్డానని నాగబాబు  తెలిపారు.

ఈ విధంగా ఈ సినిమా తిరిగి విడుదల అయ్యి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా కూడా చరణ్ హిట్ ఖాతాలోకి వెళుతుందని ఈ సినిమా రీ రిలీజ్ సమయంలో ఇంత మంచి సక్సెస్ అందుకోవడంతో చరణ్ కి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ తీరిపోయిందని ఈ సందర్భంగా నాగబాబు ఎంతో ఎమోషనల్ అవుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus