గత కొన్నిరోజులుగా కేసీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ కు 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ పత్రికలో ఈ వార్త ప్రచురితం కావడంతో ఈ వార్త గురించి జోరుగా చర్చ జరిగింది. టీడీపీకి అనుకూలంగా ఉండే పత్రికలో ఈ వార్తలు ప్రచారంలోకి రావడం పవన్ అభిమానులకు సైతం కోపం తెప్పించింది. నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను రిలీజ్ చేయగా ఆ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ ఛానెళ్లు నిష్పక్షపాతంగా వార్తలను అందించాలని ఈ కాలంలో అలాంటి వార్తలను కోరుకోవడం కూడా తప్పవుతుందని అన్నారు. ప్రతి న్యూస్ ఛానల్ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని నాగబాబు చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులు నీచంగా కామెంట్లు చేస్తే ఆ కామెంట్లను వారి విజ్ఞతకే వదిలేయవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జర్నలిజం విలువలను పాటించకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేసే న్యూస్ ఛానెళ్లను ఏ పేరుతో పిలవాలని ఆయన ప్రశ్నించారు.
గుడ్డ కాల్చి మొహం మీద వేస్తే ఉక్కిరిబిక్కిరి కావడానికి పవన్ అవినీతి నాయకుడు కాదని పాతికేళ్ల భవిష్యత్తు కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నాడని నాగబాబు అన్నారు. కూర్చున్న చెట్టు కొమ్మలను నరుక్కుంటే చచ్చేది మీరేనంటూ నాగబాబు కామెంట్లు చేశారు. నాగబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు వివరణ ఇవ్వడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వినోదాయ సిత్తం రీమేక్ తో బిజీగా ఉన్నారు. పవన్ హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. పవన్ సినిమాపైనే హరీష్ శంకర్ కెరీర్ ఆధారపడి ఉంది. పవన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.