మెగా బ్రదర్ నాగబాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. సినీ నటుడిగా, జనసేన నేతగా నాగబాబు పాపులారిటీని పెంచుకుంటారు. సోషల్ మీడియాలో నాగబాబు చేసే పోస్ట్ లు, ట్వీట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించి ఏపీ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఫలితాల గురించి నాగబాబు స్పందించడం గమనార్హం.
వై నాట్ పులివెందుల అంటూ నాగబాబు సెటైర్లు వేశారు. వై నాట్ 175 అనేది వైసీపీ నినాదం కాగా నాగబాబు రివర్స్ లో సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ గురించి వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. నాగబాబు జనసేన రాజకీయాల్లో యాక్టివ్ కావడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శల గురించి కూడా నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తున్నారు.
నాగబాబు సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాగబాబు వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. మరోవైపు మెగా హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉండగా పవన్ వినోదాయ సిత్తం రీమేక్ తో బిజీ కానున్నారు.
పవన్ సినిమాలలో ఏ సినిమా ముందు రిలీజవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ హీరోల సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Why Not పులివెందుల..?
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 19, 2023
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?