Nagarjuna: పెళ్లిపై నాగార్జున కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నారంటే?

సెలబ్రిటీలు అన్నాక… ఏ చిన్న మాట అన్నా పెద్ద మాట అయిపోతుంది. అందుకే జనాల మధ్యలోకి వచ్చాక కాస్త చూసుకుని, అనుకొని మాట్లాడాలని అంటుంటారు. ఏదో సరదాకి అన్న మాటలు అయినా సరే… పెద్ద ఇబ్బందిని తెచ్చిపెడతాయి. ఆ మాట అన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ… ఆ తర్వాత దాని గురించి పెద్ద పెద్ద పంచాయితీలు జరిగే అవకాశం ఉంటుంది. అలా నాగార్జున కొన్ని రోజుల క్రితం చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, ఆ మాట ఆయనేదో సరదాకి అన్నారు అనుకోవచ్చు. కానీ బిగ్‌బాస్‌ లాంటి షో స్టేజీ మీద అనడం పెద్ద విషయమే కదా. అంతలా నాగార్జున ఏమన్నారబ్బా అనుకుంటున్నారా? ఆ మాట సగటు మగాడు ఏదో సందర్భంలో అనుకునే మాట. అదేనండీ పెళ్లి గురించి. ‘స్కంద’ సినిమా ప్రచారం కోసం ఇటీవల రామ్‌ బిగ్‌ బాస్‌ షోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా స్టేజీ మద జరిగిన మాటామంతీలో పెళ్లి గురించి టాపిక్‌ వచ్చింది.

బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్న శివాజీతో రామ్‌ మాట్లాడుతుండగా… ‘ఇంకెందుకు ఆలస్యం పెళ్లి చేసుకో’ అని శివాజీ అన్నాడు. దీనికి రామ్‌ ఏదో సమాధానం ఇచ్చాడు. అయితే అక్కడితో ఆ విషయం ఆగలేదు. ‘ఊబిలో ఉన్నోడు మిగిలిన వాళ్లను ఊబిలోకి లాగాలని చూస్తారు’ అని అర్థం వచ్చేలా నాగార్జున ఓ కామెంట్‌ చేశాడు. నిజానికి ఆ మాట అలా ఏదో పాసింగ్‌ స్టేట్‌మెంట్‌లా వెళ్లిపోయింది. కానీ నాగార్జున అంత పెద్ద స్టేజీ మీద పెళ్లి గురించి కామెంట్‌ ఎందుకు చేశారు అనేదే ఇక్కడ విషయం.

మామూలుగా అయితే నాగార్జున (Nagarjuna) ఇలాంటి మాటలు అనడం మనం పెద్దగా వినం. పోనీ ఏదో రామ్‌తో జోక్‌ చేద్దామని అలా అన్నారు అనుకుందాం. అంతేకాదు ఈ మాట సగటు పురుషుడు కూడా అంటూ ఉంటాడు. కానీ ఆ వేదిక మీద అలాంటి మాటలు సరికాదు అనే చర్చ కనిపిస్తోంది. నాగ్‌ ఎందుకు అంత లైట్‌ కామెంట్‌ చేశారో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus