Nagarjuna, Naga Shaitanya: చై – సామ్‌ ప్రస్తు పరిస్థితులపై నాగార్జున ఏమన్నారంటే?

పెళ్లి పది మంది మధ్యలో జరిగేది.. సంసారం నాలుగు గోడల మధ్య జరిగేది. అలాంటి నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఎవరూ చెప్పలేరు. కానీ బయట నుండి అది జరిగిందట, ఇది జరిగిందట అంటూ అంటుంటారు. కానీ ఏమైందో వారికే తెలుస్తుంది. ఈ మాటలు ఎక్కడో విన్నట్లున్నాయి కదా. అప్పుడెప్పుడో విడాకుల గురించి పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలివి. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో బయటకు తెలియకపోయినా.. ఏవేవో కథలు వచ్చేస్తుంటాయి.

అలా నాగచైతన్య, సమంత మధ్యలో కూడా చాలా వార్తలు బయటికొచ్చాయి. తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. నాగచైతన్య గురించి రీసెంట్‌గా సోషల్‌ మీడియాలో, మీడియాలో చాలా రకాలుగా వార్తలొస్తున్నాయి. అయితే వాటిలో ప్రొఫెషనల్‌ లైఫ్‌ కంటే, పర్సనల్‌ లైఫ్‌ గురించే ఎక్కువ ఉంటున్నాయి. సమంతతో విడిపోయిన విషయం గురించే ఎక్కువ వార్తలు కనిపిస్తున్నాయి. దీనిపై నాగార్జున తాజాగా స్పందించారు. ‘చైతన్య గురించి మీడియాలో ఇటీవల వస్తున్న వార్తలను చూస్తుంటే మీకేం అనిపిస్తోంది?’ అని అడిగితే ఇలా స్పందించారు.

నాగచైనత్య ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను అదొక్కటే చూస్తున్నాను. ఈ విషయం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. పెళ్లి బ్రేక్‌ అవ్వడం చైతు విషయంలో దురదృష్టమే. కానీ అదొక ఎక్స్‌పీరియన్స్‌గా ఉండిపోతుంది. ఈ విషయం మీద ఇంకా మనం ఆలోచించుకోవడం సరికాదు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్రజలు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేస్తారు అని ఆశిస్తున్నాను అంటూ తన ఆలోచనను చెప్పేశాడు నాగార్జున.

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న కొత్తల్లో చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిలో మేజర్‌ పార్ట్‌ సమంత సన్నిహితుల నుండి బయటకు వచ్చినవే. నిజానికి విడాకుల వ్యవహారం కూడా వారి నుండే బయటకు వచ్చింది. ఆ తర్వాత అంతా సమసిపోయింది.. ఇక ఆ మేటర్‌ ఎవరికీ గుర్తు రాదు అనుకుంటున్నప్పుడు ఓ హీరోయిన్‌తో చైతు ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు సమంత కలగజేసుకొని నెటిజన్లకు క్లాస్‌ పీకింది. ఆ తర్వాత కరణ్‌ ఓటీటీ షోలో రిలేషన్‌ గురించి పదే పదే మాట్లాడి గుర్తు చేసింది. దాంతో మళ్లీ మళ్లీ చైతు – సామ్‌ వ్యవహారం మీడియాలో తిరుగుతూనే ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus