Nagarjuna: నాగార్జున 100వ సినిమా విషయంలో ఆ వార్త నిజమేనా..?

అక్కినేని నాగార్జున.. కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన తన ప్రయోగాలు మానలేదు. ఆయన నటించిన 98 సినిమాలను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. టాలీవుడ్లో ఎక్కువ కొత్త దర్శకులను పరిచయం చేసింది నాగార్జునే. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. రాంగోపాల్ వర్మ దగ్గర్నుండి కళ్యాణ్ కృష్ణ వరకు.. ఎంతో మంది సక్సెస్ ఫుల్ దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత నాగార్జునకే చెల్లింది.

ప్రస్తుతం (Nagarjuna) నాగ్ 99 వ సినిమాలో నటిస్తున్నారు. దాన్ని కూడా నూతన దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడి వరకు పర్వాలేదు. కానీ దీని తర్వాత నాగ్ 100 వ ప్రాజెక్టు ఉంది. ల్యాండ్ మార్క్ మూవీ అన్నాక.. స్టార్ హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ నాగార్జున మాత్రం తమిళ దర్శకుడు నవీన్ కి ఛాన్స్ ఇచ్చాడట. ఇతను విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ లతో `అగ్ని సిర‌గుగ‌ల్‌’ అనే సినిమా చేశాడు. ఇది అక్కడ బాగానే ఆడింది.

కానీ కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడికి 100 వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వడం అంటే ముమ్మాటికీ రిస్క్ అనే చెప్పాలి. అయినా నాగ్ తగ్గడం లేదు అని ఇన్సైడ్ టాక్. ఇక జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే స్క్రిప్ట్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల కూడా ఇన్వాల్వ్ అవ్వొచ్చు అని ఇన్సైడ్ టాక్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus