Nagarjuna: ఆ విషయంలో స్టార్ హీరో నాగార్జున గ్రేట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. తన సినీ కెరీర్ లో ఏకంగా 40 కంటే ఎక్కువమంది కొత్త డైరెక్టర్లకు నాగ్ ఛాన్స్ ఇచ్చారు. ఈ స్థాయిలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన ఏకైక హీరో నాగార్జున కావడం గమనార్హం. తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించిన నాగ్ ఆ సినిమాలతో ప్రశంసలతో పాటు విజయాలను అందుకున్నారు.

గీతాంజలి, అన్నమయ్య, శివ, కింగ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలలో అద్భుతమైన పాత్రలలో మెప్పించిన నాగ్ ఈరోజు 64వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. వయస్సు పెరిగే కొద్దీ నాగార్జున అందం కూడా అంతకంతకూ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు పదుల వయస్సులో కూడా ఫిట్ గా కనిపిస్తూ నాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని నాగ్ తెలిపారు.

కొత్తవారు దర్శకత్వం వహిస్తే సినిమాకు కొత్తదనం వస్తుందని నాగ్ చెబుతున్నారు. నాగార్జున చిన్న వయస్సులోనే వెలుగునీడలు, సుడిగుండాలు సినిమాలలో నటించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా యాక్ట్ చేసిన హీరో నాగ్ కావడం గమనార్హం. ఈ విషయంలో నాగ్ ను మించిన హీరో లేడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యాత్మిక సినిమాలలో ఎక్కువగా నటించిన నాగార్జున ఆ సినిమాలతో కూడా భారీ సక్సెస్ లను అందుకున్నారు.

నాగార్జున (Nagarjuna) పారితోషికం ప్రస్తుతం 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగ్ ప్రస్తుతం నా సామిరంగ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నాగార్జునకు భారీ సక్సెస్ అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు నాగార్జున రేంజ్ పెరుగుతుండటం గమనార్హం. స్టార్ హీరో నాగార్జున కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus