Nagarjuna: ‘లాల్ సింగ్’ వర్కౌట్ కాలేదు.. ‘బ్రహ్మాస్త్ర’ కలిసొచ్చింది..!

  • September 14, 2022 / 01:31 AM IST

అక్కినేని నాగేశ్వరరావు గారు నెంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆయన లెజెసీని నాగార్జున కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. నాగార్జున కూడా ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పోటీలో నాగార్జున కొడుకులు స్టార్ హీరోలుగా రాణించలేకపోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ వంటి హీరోల సినిమాలు హిట్లు కొట్టడమే గగనంగా ఉంది పరిస్థితి. ఒకవేళ అవి హిట్ అయినా రూ.80 కోట్లు నుండి రూ.90 కోట్లు మధ్యలో ఆగిపోతున్నాయి.

ఇప్పటికే మిడ్ రేంజ్ హీరోలు చాలా మంది రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేశారు.’గీత గోవిందం’ తో విజయ్ దేవరకొండ, ‘ఎఫ్2’ వంటి మల్టీస్టారర్ తో వరుణ్ తేజ్, ‘భీమ్లా నాయక్’ వంటి మల్టీస్టారర్ తో రానా, ‘కార్తికేయ2’ తో నిఖిల్ వంటి హీరోలు రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నారు. కానీ నాగచైతన్య, అఖిల్ లు మాత్రం ఇంకా ఆ ఫీట్ ను సాధించింది లేదు.

ఆమిర్ ‘లాల్ సింగ్ చడ్డా’ వంటి బడా మూవీతో నాగ చైతన్య ఈ ఫీట్ ను సాధిస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ లాల్ సింగ్ మొదటి వీకెండ్ కే దుకాణం సర్దేసింది. కానీ నాగ చైతన్య బాల పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే నాగార్జున మాత్రం ఈ ఫీట్ ను సాధించారు. ఇటీవల నాగార్జున ఓ కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ లో ఆయన అనీష్ శెట్టి అనే ఆర్టిస్ట్ పాత్రని పోషించారు.

నాగార్జున ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇంటర్వెల్ సీన్ వరకు బ్రహ్మాస్త్ర మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ చిత్రంలో నాగ్ పాత్రకు బాలీవుడ్లో కూడా మంచి అప్లాజ్ వచ్చింది. గతంలో కూడా నాగార్జున హిందీ సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ పాత్రలు కూడా నాగార్జునకి గుర్తింపు తెచ్చినవి కాదు. కానీ ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం నాగ్ కు రెండు విధాలుగా కలిసొచ్చింది. అక్కినేని ఫ్యామిలీకి రూ.100 కోట్ల ముచ్చట కూడా తీర్చింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus