క్లాస్, మాస్..కామెడీ..యాక్షన్.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో. ఆరోజుల్లో ఈయన హెయిర్ స్టైల్ ని, మ్యానరిజమ్స్ ని ఫ్యాన్స్ తెగ ఫాలో అయ్యేవారు. నాగార్జున 65సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నాగార్జున లుక్స్ ని మైంటైన్ చేసే విషయం లో కానీ, డ్రెస్సింగ్ స్టైల్ లో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోడు. మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ ఫ్యాషన్ ని అనుసరించడం ఆయన స్టైల్.
ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున, ప్రతీ శనివారం మరియు ఆదివారం కలర్ ఫుల్ షర్ట్ మరియు ప్యాంట్ తో దర్శనమిస్తూ అందరికీ కనిపిస్తున్నాడు. ఈయన ఏంటి తిర్నాలులో అమ్మే షర్ట్ వేసుకొస్తున్నాడు అని ఆయన మీద సెటైర్స్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ షర్ట్స్ విలువ తెలిస్తే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కళ్ళు బైర్లు కమ్ముతాయి.
గత వీకెండ్ నాగార్జున (Nagarjuna) నారింజ మిఠాయి రంగులో ఉన్న షర్ట్ ని వేసుకొచ్చాడు. ఈ షర్ట్ వేలెంటినో అనే అమెరికన్ బ్రాండ్ కి సంబంధించినది. దీని ధర దాదాపుగా 1132 యూరోలు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,03,395 రూపాయిలు అన్నమాట. ఇది సామాన్యులు కొనగలరా..?, ఇంకా చెప్పాలంటే ఈ చొక్కా అసలు విలువ 1,10,000 రూపాయిలు అట. ఇప్పుడు ఆఫర్ ఉండబట్టే 7 వేల రూపాయిలను తగ్గించినట్టు తెలుస్తుంది.
లక్షకు పైగా చొక్కా కి డబ్బులు ఖర్చు చేసే స్తొమత సామాన్య ప్రజలకు ఉండదు. ఆ డబ్బుతో నెల రోజులు ఎలాంటి చీకు చింతా లేకుండా మధ్య తరగతి కుటుంబం బ్రతికేయొచ్చు. ఈ చొక్కా ఆన్లైన్ లో అందుబాటులోనే ఉంది, ఎవరైనా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున ‘నా సామి రంగా’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఆయన ధరించే దుస్తులు మొత్తం ఇలాంటివే ఉంటాయని సమాచారం.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!