Nagarjuna: విమర్శలు గమనిస్తున్నావా నాగ్.. కంట్రోల్ చేయకపోతే కష్టమంటూ?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో సీజన్7లో ఆట సందీప్, అమర్ దీప్ కంటెస్టెంట్లుగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ కంటెస్టెంట్లను కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో సీజన్7 నుంచి ఇప్పటివరకు వరుసగా ఆరు వారాల పాటు ఆరుగురు అమ్మాయిలను ఎలిమినేట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు అమర్ దీప్ కుటుంబ సభ్యులను ఒక కంటెస్టెంట్ పీఆర్ టీం కావాలని టార్గెట్ చేస్తూ రాయడానికి, చెప్పడానికి కూడా అభ్యంతకర భాషలో ట్రోల్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. నాగార్జున హోస్టింగ్ విషయంలో ఆట సందీప్ భార్య ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విమర్శలను ఆపకపోతే బిగ్ బాస్ షో సీజన్7కు మరింత నెగిటివ్ గా జరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున తలచుకుంటే ఇలాంటి చిన్నచిన్న సమస్యలకు చెక్ పెట్టడం కష్టం కాదని చెప్పవచ్చు. నాగార్జున ఈ కామెంట్ల విషయంలో జోక్యం చేసుకోకపోతే భవిష్యత్తులో బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి సైతం కంటెస్టెంట్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నాగార్జున రాబోయే రోజుల్లో అయినా ఈ కామెంట్ల గురించి రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.

నాగార్జున (Nagarjuna) సినీ కెరీర్ విషయానికి వస్తే నాగ్ ప్రస్తుతం నా సామిరంగ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. నాగ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు హీరోగా తన రేంజ్, మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. నాగ్ వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus