Nagarjuna: కొత్త సినిమా కోసం కొత్త రకం దర్శకుణ్ని ఓకే చేసిన నాగార్జున!

నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అవేవీ ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు కావు. దీంతో నాగ్‌ కొత్త సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఇంకా వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఓ కొత్త కాంబినేషన్‌ చర్చలోకి వచ్చింది. ఓ యంగ్‌ డైరెక్టర్‌తో నాగార్జున ఓ సినిమా చేయడానికి దాదాపు సిద్ధమయ్యారు అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి, ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్తే త్వరలో అనౌన్స్‌మెంట్‌ వస్తుంది అని చెబుతున్నారు.

Nagarjuna

‘నా సామిరంగ‌’తో ఓ మాస్ హిట్ అందుకున్న నాగార్జున‌.. ప్ర‌స్తుతం ‘కుబేర‌’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘కుబేర’కు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, ధ‌నుష్ హీరో. ‘కూలీ’ సినిమాకు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడుగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలు కాకుందా నాగ్‌ సోలో హీరోగా సినిమా ఒక‌టి ప‌ట్టాలెక్కాల్సి ఉందిది. సెప్టెంబ‌రులో మొదలు పెట్టి, సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఆ సినిమా కుదర్లేదు.

దీంతో ‘ఓం భీమ్‌ బుష్‌’, ‘హుషారు’ సినిమాల ఫేమ్‌ శ్రీహర్ష చెప్పిన కథను ఓకే చేశారు అని తెలుస్తోంది. కాస్త డబుల్ మీనింగ్‌ డైలాగులు, సీన్లతో తొలి రెండు సినిమాల్లో విజయం అందుకున్న శ్రీహర్ష ఇప్పుడు నాగ్‌ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారో చూడాలి. ఎందుకంటే ఆయన స్టైల్‌ కథలు నాగార్జున లాంటి పెద్ద హీరోకు నప్పవు. జ‌నవ‌రిలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించే అవ‌కాశం ఉంది.

ఇక నాగార్జున ఇంట్లో ఇప్పుడు ఫెస్టివల్స్‌ నడుస్తున్నాయి. మొన్నీ మధ్యే అఖిల్‌కు నిశ్చితార్థం జరగా.. ఈ రోజు నాగచైతన్య – శోభిత పెళ్లి జరగబోతోంది. దీనికి టాలీవుడ్‌ ప్రముఖులు చాలామంది వస్తున్నారు అని లీక్‌లు ఇచ్చారు. మరి ఎవరు వస్తారు అనేది చూడాలి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి వేడుక జరగనుంది. దీనికి సంబంధించి అప్‌డేట్స్‌ ఈ రోజంతా ఉండనున్నాయి.

సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ టీం రియాక్షన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus