Nagarjuna: నాగార్జున కాదని జగపతి బాబు చేసి సూపర్ హిట్ అయిన సినిమా అదే..!

కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నాగార్జునే ముందుంటారు. మంచి కథలు కాబట్టి రీమేక్ చేసాం అనే హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ.. సినిమా కథలో రిస్క్ ఉందని తెలిసినా ముందడుగు వేసేది ఆయన మాత్రమే..! టాలీవుడ్ కు ఆయన పరిచయం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అక్కినేని అందగాడి గురించి చాలా విషయాలే ఉంటాయి. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు.

నిర్మాతగా ఆయన 30సినిమాలు వరకు రూపొందించారు. ఇదిలా ఉండగా.. ఓసారి నాగార్జున వద్దకి ఓ స్టార్ డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చాడు. అది నాగ్ కు నచ్చినా సరే రిజెక్ట్ చేసాడు. అలా అని దానిని పక్కన పెట్టలేదు. మరో హీరోతో చేసి హిట్ కొట్టారు. ఆ సినిమా మరేదో కాదు ‘ఆహా’. 1998వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాని ‘బాషా’ ‘మాష్టర్’ వంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. 1997 ఆయన తమిళంలో తెరకెక్కించిన ‘ఆహా’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ కథని ముందుగా నాగార్జునతో చేద్దాం అనుకున్నారు సురేష్ కృష్ణ. అందుకు నాగ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు కూడా చేస్తానని హామీ ఇచ్చారట. అయితే నాగ్ మాత్రం మంచి కథని చెడగొట్టడం ఎందుకు.. మరో హీరోతో చేద్దాం.. నేనే ప్రొడ్యూస్ చేస్తానని నాగ్ హామీ ఇచ్చారట. అలా జగపతి బాబుని ఒప్పించి ‘ఆహా’ గా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్టే..! నేటితో ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు పూర్తికావస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus