Nagarjuna: నాగార్జున ఏ సినిమా డైరెక్టర్ గా పని చేశాడో తెలుసా..!

ఏఎన్ఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడుగా ఇటు గ్లామర్ తోనూ, అటు యాక్టింగ్ తోనూ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక టాలీవుడ్ మన్మథుడిగా ఇప్పటికీ యువతుల కలల రాకుమారుడిగా వెలుగొందుతున్నాడు. 64ఏళ్ల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తూ కుర్ర‌ హీరోలకు పోటీగా తన బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా ఆదరించే వారిలో నాగార్జున ముందు వరుసలో నిలుస్తారు.

అన్ని జాన‌ర్లు నటిస్తూ సక్సెస్ అందుకున్న నాగార్జున తెలుగు ఆడియన్స్ తో పాటు తమిళ్, హిందీ ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో పాన్ ఇండియా హీరో అంటే నాగార్జునే. ఆయన కేవలం నటుడిగానే కాకుండా సక్సెస్ ఫుల్ నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున (Nagarjuna) ఇప్పటి వరకు హీరోగా, ప్రొడ్యూసర్ గా, బిజినెస్ మ్యాన్ అనే అందరికీ తెలుసు.

కానీ ఆయన ఓ సినిమాకు దర్శకత్వం కూడా చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. నాగార్జున, దర్శకుడు దశరథ్ కాంబినేషన్లో సంతోషం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో తర్వాత వచ్చిన సినిమా గ్రీకువీరుడు. ఇక నాగార్జున – దశరథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బోల్తా కొట్టింది.

ఈ సినిమా షూటింగ్ టైంలో దశరథ్ అనారోగ్యం బారిన పడడంతో షూటింగ్ మధ్యలో నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. షూటింగ్ ఆగిపోతే నయనతార తో పాటు మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. 2 నెలల పాటు షూటింగ్ ఆపేయాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో నాగార్జునే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడట. డైరెక్టర్ గా బాధ్యతలు వహించి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుభవం లేకుండా దర్శకత్వం చేయడం మూలానే సినిమా ప్లాప్ అయిందంటున్నారు నెటిజన్లు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus