Nagarjuna: 100వ చిత్రం కోసం రిస్క్ చేయనున్న నాగార్జున..!

టాలీవుడ్‌లో కింగ్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున కూడా తన 100వ సినిమా కోసం చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుండి తన 100వ సినిమాను ఎవరితో చేయాలి, ఏ కథను ఎంచుకోవాలి అనే అయోమయంలో ఉన్నారు నాగార్జున. అంతే కాకుండా ఈ మూవీ గురించి అనేక రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగ్.. 100వ చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

నాగార్జున (Nagarjuna) 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడని ఇప్పటికీ చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మోహన్ రాజా దర్శకత్వంలో నాగ్ చేయనున్న 100వ చిత్రంలో అఖిల్ కూడా ఉంటానని, ఇది వీరిద్దరి మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతుందని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ గత కొన్నిరోజులుగా ఈ రూమర్స్ కూడా వినిపించడం ఆగిపోవడంతో మోహన్ రాజాతో నాగార్జున చిత్రం ఆగిపోయిందని తెలుస్తోంది.

అందుకే తన 100వ సినిమా కోసం మరో తమిళ దర్శకుడిని లైన్‌లో పెట్టారట నాగ్. రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్‌తో నాగ్ 100వ సినిమా ఉండబోతుందని కొత్తగా వార్తలు మొదలయ్యాయి. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తన మల్టీ టాలెంట్స్‌ను నిరూపించుకుంటూ కోలీవుడ్‌లో ఒక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు నవీన్. ఇప్పటికీ తను దర్శకుడిగా తెరకెక్కించింది రెండు సినిమాలే. 2013లో ‘మూడర్ కూడుమ్’ అనే చిత్రంతో కేవలం దర్శకుడిగానే కాదు, నిర్మాతగా, నటుడిగా కూడా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు నవీన్.

కానీ తన రెండో సినిమాను డైరెక్ట్ చేయడానికి మాత్రం తనకు దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. ‘మూడర్ కూడమ్’ తర్వాత 2021లో ‘అగ్ని సిరగుగల్’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. సమస్య ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. నాగార్జున తలచుకుంటే స్టార్ డైరెక్టర్లు సైతం తన 100వ చిత్రాన్ని తెరకెక్కించడానికి ముందుకొస్తారు. కానీ నాగ్ మాత్రం ఏరికోరి ఈ దర్శకుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో రిస్క్ చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి.. అని ఫ్యాన్స్ అంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus