సంక్రాంతి సెంటిమెంట్ గా రాబోతున్న బంగార్రాజు సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. 2016లో సంక్రాంతి సందర్భంగా స్పెషల్ గా విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక ఈసారి పట్టిబట్టి సంక్రాంతికే విడుదల చేయాలని బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పైగా పెద్ద సినిమాల నుంచి పోటీ కూడా లేకపోవడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
తప్పకుండా ఈ సినిమా నాగార్జున – నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలవడం కాయమని అర్థమైపోతుంది.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి నాగలక్ష్మి అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మొత్తానికి రమ్యకృష్ణ కూడా నానమ్మ పాత్రలో నటించినప్పటికీ అంధంగానే దర్శనమివ్వ బోతున్నారు. ఇక సినిమాలో అసలు కథ ఎలా ఉంటుందనే విషయంలో దర్శకుడు ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే బంగార్రాజు కథ కూడా మొదలవుతుందట.
యువ బంగార్రాజుగా నాగచైతన్య కూడా మన్మథుడిగా బ్యూటీలతో రెచ్చిపోతాడాని తెలుస్తోంది. ఇక సినిమాలో ఒక గుడికి అలాగే సొంత గ్రామానికి వచ్చే ఒక కీలక సమస్య బంగార్రాజు దృష్టికి రావడంతో అతను ఆత్మగానే ఉంటూ తన మనవడు యువ బంగార్రాజుతో ఆ సమస్యను సాల్వ్ చేస్తాడట. ఈ ప్రక్రియలో పాముకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. బంగార్రాజు ఆత్మ పాత్రతోనే చాలా బాగా ఎట్రాక్ట్ చేస్తాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తాయని దర్శకుడు వివరణ ఇచ్చారు. కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమాని తెరకెక్కించినట్లు దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.