Nagavamsi: ‘ఆదికేశవ’ సినిమాపై ‘సితార’కు అంత నమ్మకమా? అందుకే ముందు రోజే..!

ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి. అయితే అన్నీ అందరికీ తెలియవు. అయితే సినిమా వాళ్ల సెంటిమెంట్లు మాత్రం తెలిసిపోతుంటాయి, ఆ తర్వాత వైరల్‌ అవుతుంటాయి. ఫలానా విషయాన్ని ఎందుకు నమ్ముతారు, ఎందుకు విశ్వసిస్తారు, ఎందుకు పాటిస్తారు అంటూ సినిమా జనాల సెంటిమెంట్ల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా ఓ యువ అగ్ర నిర్మాత సెంటిమెంట్‌ ఒకటి బయటికొచ్చింది. అయితే ఆ విషయాన్ని ఆయనే చెప్పడం గమనార్హం.

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి రూపొందించిన చిత్రం ‘ఆదికేశవ’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను చాలా వాయిదాల అనంతరం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ‘ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌’ను టీమ్‌ ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అలాగే ‘ఆదికేశవ’ సినిమా విషయంలో ఆయన ఎంత నమ్మకంతో ఉన్నారు అనేది కూడా ఆ ప్రెస్‌ మీట్‌ మాటల బట్టి తెలుస్తోంది. ‘ఆదికేశవ’ సినిమా విషయంలో మేం చాలా నమ్మకంగా ఉన్నాం. కొన్ని థియేటర్లలో గురువారం సాయంత్రమే ప్రీమియర్స్‌ వేస్తాం అని ప్రకటించేశారు. దీంతో ఇన్ని వాయిదాల తీసుకున్న సినిమా మీద ఇంత నమ్మకం ఎలా అని అనుకుంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ సినిమాకు తాము సెంటిమెంట్‌గా భావించే తిరుపతిలోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేస్తాం అని కూడా నాగవంశీ తెలిపారు.

దీంతో ‘ఆదికేశవ’ సినిమా మీద (Nagavamsi) నాగవంశీ నమ్మకం ఏంటి? అనే ప్రశ్న మళ్లీ వినిపిస్తోంది. కమర్షియల్‌ మూవీ అని టీజర్‌, ట్రైలర్‌ చూస్తే చెప్పేయొచ్చు. వైష్ణవ్‌తేజ్‌ తొలి సినిమా ‘ఉప్పెన’ ఇచ్చిన బజ్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత ఫ్లాప్‌లే వచ్చాయి. అయితే శ్రీలీల మాత్రం సినిమాకు ఎక్స్‌ఫ్యాక్టర్‌ అని చెప్పొచ్చు. మరి ఈ కాంబో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus