Mahesh Babu, Namrata: వైరల్ అవుతున్న మహేష్ భార్య ఎమోషనల్ పోస్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నారు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా కచ్చితంగా విడుదలయ్యేలా మహేష్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కే సినిమాలు కూడా ఈ ఏడాదే మొదలుకానున్నాయి.

మహేష్ భార్య నమ్రత వయస్సులో మహేష్ బాబు కంటే పెద్ద అనే సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. తాజాగా నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రత ఆ పోస్ట్ లో ప్రతిరోజూ పిల్లలతో జాలీగా గడపటం కంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ కు సోషల్ మీడియాలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే విధంగా నమ్రత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ కొడుకు గౌతమ్ ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ కూతురు సితార కూడా సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సితారకు కూడా సినిమాలపై ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నమ్రత మహేష్ కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్, నమ్రత కాంబినేషన్ లో తెరకెక్కిన వంశీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

మహేష్ నమ్రత కలిసి నటించి ఆ సినిమా సక్సెస్ సాధిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమాసినిమాకు మహేష్ బాబుకు మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ మార్చి రెండవ వారానికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus