SSMB28: అంత జరిగినా మహేష్, త్రివిక్రమ్ దూరం కాలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే అందులో ఆయన సతీమణి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇక ఆమె మాటకు అంత వాల్యూ ఇస్తాడు కాబట్టే మహేష్ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. నమ్రత ఆలోచన విధానం కేవలం మహేష్ మార్కెట్, స్టోరీ సెలక్షన్ వరకే పరిమితం కాలేదు. అనుకోని సమస్య వచ్చినప్పుడు మ్యాటర్ ను స్వీట్ గా క్లోజ్ చేసే తెలివి కూడా ఆమె వద్ద ఉందట. ఎవరితో ఎప్పుడైనా అవసరం పడవచ్చని ప్రతి అడుగు ఆలోచించి వేస్తారట.

ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ మరోసారి సినిమా చేయడానికి కారణం నమ్రత మాస్టర్ ప్లాన్ అనే తెలుస్తోంది. ఆమె అలా చేయకపోయి ఉంటే ఈ కాంబో అంత ఈజీగా సెట్టయ్యేది కాదట. నమ్రత చేసిన మంచి పని ఏమిటంటే.. నిజానికి ఇదివరకే త్రివిక్రమ్ సినిమా కోసమని హారిక హాసిని క్రియేషన్స్ నుంచి అడ్వాన్స్ పుచ్చుకున్న మహేష్ కథ సెట్టవ్వలేదని రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తరువాత మహేష్ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడు. సాధారణంగా అడ్వాన్స్ తీసుకుంటే పెద్ద హీరోలను అంత ఈజీగా వదలరు.

ఎదో ఒకరకంగా స్క్రిప్ట్ మర్పించి ఒప్పిస్తారు. లేదంటే మరొక దర్శకుడిని లైన్ లో పెడతారు. కానీ అది జరగలేదు. మహేష్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చాడు అంటే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చే ఛాన్స్ ఎంతైనా ఉంటుంది. కానీ అక్కడే నమ్రత తెలివిగా ఆలోచించి మహేహ్, త్రివిక్రమ్ తో యాడ్స్ చేయించింది. ఆ వర్క్ కారణంగా ఇద్దరి మధ్య మళ్ళీ ఎప్పటిలానే సఖ్యత కనిపించింది. త్రివిక్రమ్ కూడా హై వోల్టేజ్ లాంటి కథను రెడీ చెయ్యాలని ఆలోచించాడు. ఆ విధంగా మహేష్ ,త్రివిక్రమ్ కాంబో సెట్టవ్వడానికి నమ్రత తెరవెనుక మంచి మాయ చేసినట్లు టాక్.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus