Mahesh, Namrata: తమ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నమ్రత..!

మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె మహేష్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మహేష్ జీవితమే మారిపోయింది. మహేష్ బాబు డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయాయి. అప్పటివరకు అమూల్ బేబీలా ఉన్నవాడు మ్యాన్లీగా తయారయ్యాడు. స్టార్ డం వచ్చింది. బోలెడన్ని కమర్షియల్ బ్రాండ్స్ మహేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం మహేష్ సినిమాలకు సంబంధించిన యాడ్స్, బిజినెస్ లు, ప్రమోషన్లు వంటి వ్యవహారాలు అన్నీ నమ్రతనే చక్కపెడుతుంది.

మరోపక్క ఫ్యామిలీ విషయంలో కూడా ఈమె చాలా కేర్ తీసుకుంటుంది.సోషల్ మీడియాలో మహేష్ కొత్త ఫోటోలను, గౌతమ్, సితార ల కొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా.. చాలా గ్యాప్ తర్వాత నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. మహేష్ కు తనకు ఎక్కువ గొడవలు వస్తుంటాయని..!

అది కూడా పిల్లల కారణంగా అని చెప్పుకొచ్చింది. అలాగే పెళ్ళైన ఈ 17 ఏళ్లలో ఆమెకు సినిమా ఆఫర్లు చాలా వచ్చాయని.. కానీ దేనికి ఓకే చెప్పలేదని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఏ సినిమాలోనూ నటించే అవకాశం లేదని చెప్పింది. ఇక మహేష్ నటించిన సినిమాల్లో ‘పోకిరి’ ఇష్టమని, వారిద్దరినీ కలిపిన వంశీ సినిమా మాత్రం నచ్చదని.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus