Namrata: సితారను కనాలని అనుకోలేదు… నమ్రత షాకింగ్ కామెంట్స్!

నటిగా మహేష్ బాబు భార్యగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన నటి నమ్రత గురించి అందరికీ సుపరిచితమే. నాటిక ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నమ్రత మహేష్ బాబుతో కలిసి సినిమాలలో నటించి ఆయన ప్రేమలో పడ్డారు.ఇలా మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై కేవలం పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. తాజాగా నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నమ్రత మాట్లాడుతూ పెళ్ళికి ముందు మహేష్ బాబు చాలా క్లారిటీతో ఉన్నారని పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదని చెప్పారు.అయితే నాకు సినిమాలకన్నా మహేష్ బాబుతో పెళ్లి జరగడం ఎంతో బెస్ట్ మూమెంట్ అని ఈమె తెలిపారు. మహేష్ బాబు తో పెళ్లి జరిగిన తర్వాత నా ప్రపంచమే మారిపోయిందని ఈమె తెలియజేశారు. ఇకపోతే పెళ్లి తర్వాత ఒక భార్యగా తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తించడం కోసమే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.

ఇక తన పిల్లల గురించి కూడా మాట్లాడుతూ గౌతమ్ పుట్టినప్పుడు తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు రావడం సర్వసాధారణమని తెలిపారు. గౌతమ్ పుట్టిన తర్వాత బ్రతకడం కూడా కష్టమేనని డాక్టర్లు చెప్పారని అప్పటి సంఘటనలను ఈమె గుర్తు చేసుకున్నారు. ఇక సితార గురించి మాట్లాడుతూ సితారను తాము కనాలని అనుకోలేదు తను అన్ వాంటెడ్ బేబీ.

అయితే సితార కనుక మా జీవితంలో లేకపోతే మా జీవితం ప్రస్తుతం అసంపూర్ణంగా ఉండేదని ఈ సందర్భంగా నమ్రత తన వ్యక్తిగత విషయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మహేష్ బాబు సినిమాల గురించి మాట్లాడుతూ తనకు పోకిరి సినిమా అంటే చాలా ఇష్టమని ఇందులో బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus