Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Focus » ఆల్‌రౌండర్‌ బాలయ్య.. ఇన్ని జోనర్లు.. ఇన్ని పాత్రలు ఇంకెవరైనా చేసున్నారా?

ఆల్‌రౌండర్‌ బాలయ్య.. ఇన్ని జోనర్లు.. ఇన్ని పాత్రలు ఇంకెవరైనా చేసున్నారా?

  • June 10, 2025 / 11:59 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆల్‌రౌండర్‌ బాలయ్య.. ఇన్ని జోనర్లు.. ఇన్ని పాత్రలు ఇంకెవరైనా చేసున్నారా?

క్రికెట్‌లో అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేవాళ్లను ఆల్‌రౌండర్‌ అంటారు. దానికి అదిరిపోయే ఫీల్డింగ్‌ కూడా చేస్తే పర్‌ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌ అంటారు. మరి సినిమాల్లో ఇదే మాట చెప్పాలంటే అదీ ఇదీ కాదు.. ప్రతి జోనర్‌ సినిమా చేసినవారిని, అన్ని తరహాల పాత్రలు పోషించిన వారిని ఆల్‌రౌండర్‌ అని అంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ ట్యాగ్‌ పర్‌ఫెక్ట్‌గా, యాప్ట్‌గా అనిపించే హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈ మాట విషయంలో ఎవరికీ ఎలాంటి సెకండ్‌ థాట్‌ ఉండదు. ఎందుకంటే ఆయన అలాంటి సినిమాలు చేశారు మరి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓసారి ఆ పాత్రలేంటో, ఆ లెక్కేంటో చూద్దాం.

Nandamuri Balakrishna

అప్పుడెప్పుడో సినిమాల నుండి స్టార్ట్‌ చేస్తే ఇప్పటి తరానికి అర్థం కాదు కానీ.. లేటెస్ట్‌ సినిమాల నుండే చూసుకుంటూ వెళ్దాం. నిన్ననే ‘అఖండ 2’ (Akhanda 2) సినిమా టీజర్‌ వచ్చింది చూసే ఉంటారు. అందులో ఆయన మరోసారి అఘోరాగా కనిపించారు. అఖండ రుద్ర సికందర్‌ అఘోరా ఆయన తాండవమే చేశారు. స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న వ్యక్తి అఘోరాగా కనిపించాలి అని ఎవరైనా దర్శకుడు చెబితే ఓకే చెబుతారా.. కానీ బాలయ్య రెండుసార్లు చేశారు. తొలిసారి కూడా ‘అఖండ’ (Akhanda) అనే విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

సీనియర్‌ స్టార్‌ హీరో అనే ట్యాగ్‌ వచ్చినా.. ఇప్పటికీ కథా బలం ఉన్న సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మన దగ్గర. ఈ సమయంలో గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ అనే కాన్సెప్ట్‌ తనదైన శైలిలో ‘భగవంత్‌ కేసరి’లో (Bhagavanth Kesari) చేసి చూపించారు. ఇందులో ఆయన తగ్గి చేసిన సన్నివేశాలు సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి. తండ్రి బయోపిక్‌లో నటించడం అంటే ఏ కొడుకుకైనా పెద్ద పరీక్షే. కానీ ‘యన్టీఆర్‌’ సినిమాలు రెండింటిలోనూ తనదైన ముద్ర వేశారు బాలయ్య (Nandamuri Balakrishna). కొన్ని సన్నివేశాలను పెద్దాయనను ఫ్యాన్స్‌ చూసుకున్నారు అంటే ఎంత మెప్పించారో అర్థమవుతుంది.

‘తేడా సింగ్‌’ ఇలాంటి పేరును ఓ హీరో పెట్టుకుంటారా? పెట్టుకుని చాలా వైల్డ్‌గా నటించి వారెవ్వా అనిపిస్తారా? కానీ ‘పైసా వసూల్‌’లో (Paisa Vasool) బాలకృష్ణ ఆ పని చేసి చూపించారు. ముఖానికి రంగేసుకున్నాక ప్రపంచాన్ని, వయసును మరచిపోతారాయన అనే మాటకు ఆ సినిమా ఒక ఉదాహరణ. బాలకృష్ణ సినిమా అంటే భారీ డైలాగ్‌లు, లెంగ్తీ మోనోలాగ్‌లు అని అనుకునేవాళ్లు కచ్చితంగా ‘సింహా’ (Simha), ‘లెజెండ్‌’ (Legend) లాంటి సినిమాలు చూడాలి. అందులో బాలయ్య (Nandamuri Balakrishna) నటనాభిషేకం వీక్షించాల్సిందే.

రాముడైనా, కృష్ణుడైనా ఒకప్పుడు నందమూరి తారకరామరావే. ఆయన్ను అలా చూస్తుంటే రెండు చేతులు ఆటోమేటిక్‌గా దగ్గరకు వచ్చేసి నమస్కారం అయ్యేవంటారు. ఆ తర్వాత బాలయ్యనే ఆ రెండు పాత్రలు చేసి వెండితెర మీద తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ‘శ్రీరామ రాజ్యం’, ‘శ్రీ కృష్ణ విజయము’, ‘పాండురంగడు’ ఇలా వచ్చిన సినిమాలే. ఇక స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న ఈ సమయంలోనే ‘ఉ కొడతారా ఉలిక్కిపడతారా’ అంటూ ఓ హారర్‌ టచ్‌ ఉన్న సినిమా కూడా చేశారు మన బర్త్‌ డే బాయ్‌.

తెలుగు సినిమాలో నెగిటివ్‌ టచ్‌ ఉన్న పోలీసు పాత్రలు ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ‘లక్ష్మీనరసింహ’తో (Lakshmi Narasimha) ఎప్పుడో ఆ క్యారెక్టర్‌ టచ్‌ చేశారు బాలయ్య. స్టార్‌గా ఓ లెవల్‌లో ఉన్న సమయంలో చిన్నపిల్లాడి చేష్టలు చేసే హీరో పాత్రలు చేయమంటే మన స్టార్లు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ‘దేవుడు’ (Devudu) సినిమాతో ఆ పని చేసేశారాయన. ఇక ప్రజెంట్‌ తెలుగు సినిమాలో ‘భైరవద్వీపం’ (Bhairava Dweepam) లాంటి ఫాంటసీ సినిమా మరొకటి రాలేదు. అలాంటి గొప్ప సినిమా అందించిన హీరో బాలయ్యనే అని మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా?

‘ఆదిత్య 369’ (Aditya 369) సినిమా గురించి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. ఇప్పటికీ అలాంటి సినిమ మన దగ్గర ఎవరూ ట్రై చేయలేదు. బాలకృష్ణనే ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ అని సీక్వెల్‌ చేస్తాను అని చెప్పారు. అయితే ఇంకా అది మెటీరియలైజ్‌ అవ్వలేదు అనుకోండి. ఇన్ని జోనర్లు, పాత్రలు చెప్పారు.. ఆయన ట్రేడ్‌ మార్క్‌ ఫ్యాక్షన్‌ లీడర్‌ సినిమాల గురించి చెప్పలేదు. ఆయన పాత్రలు గురించి మాట్లాడలేదు అని అనుకుంటున్నారా? ఆ సినిమాలకు ఆ ట్రేడ్‌ మార్క్‌. తర్వాత చాలామంది హీరోలు ఆ పని చేసినా.. బాలయ్య వాటికి బ్రాండ్‌ అంబాసిడర్‌.

ఇంకా ఇలాంటి పాత్రలు, సినిమాలు చాలానే ఉన్నాయి. పైన చెప్పినట్లు రీసెంట్‌ సినిమాలే చెప్పాము. ఆయన గొప్ప పాత్రలు, గొప్పతనం చెప్పడం ముగిస్తూ హ్యాపీ బర్త్‌డే బాలయ్య అని చెప్పేద్దామా? ఫైనల్‌గా ‘జై బాలయ్య’ అనకపోతే ఎలా? ‘జై బాలయ్య జై జై బాలయ్య’.

ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Balakrishna

Also Read

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

related news

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

trending news

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

32 mins ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

14 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

14 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

16 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

14 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

15 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

15 hours ago
Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

18 hours ago
Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version